Sarkar Live

Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!

హైదరాబాద్: భాగ్యనగరంలో మాంసాహార ప్రియులకు ఇప్పుడు రెట్టింపు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు వేసవి తాపానికి చికెన్, మటన్ ధరలు (Chicken Price Hike) చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో

Chicken Price Hike

హైదరాబాద్: భాగ్యనగరంలో మాంసాహార ప్రియులకు ఇప్పుడు రెట్టింపు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు వేసవి తాపానికి చికెన్, మటన్ ధరలు (Chicken Price Hike) చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

Chicken Price Hike : ఆకాశాన్నంటుతున్న ధరలు: చికెన్ @ 400!

వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల చికెన్ ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ. 300 నుండి రూ. 320 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ. 400 మార్కును తాకింది.

  • మటన్ ధరలు: నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో మటన్ రూ. 940 నుండి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు.
  • నాణ్యత లోపం: ధరలు పెరగడమే కాకుండా, నాణ్యత లేని మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారుల పరీక్షలు, స్టాంపులు లేకుండానే ఎక్కడో కోసిన మాంసాన్ని దుకాణాల్లో యథేచ్ఛగా అమ్ముతున్నారు.

విస్తుపోయే వాస్తవాలు: టన్నుల కొద్దీ కుళ్లిన మాంసం సీజ్!

గత కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు జరిపిన దాడులు మాంసం దందా ఎంత దారుణంగా ఉందో నిరూపిస్తున్నాయి.

  • పార్శిగుట్ట: ఇక్కడ జరిపిన తనిఖీల్లో ఏకంగా 800 కిలోల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎలుకలు, పిల్లులు తిరుగుతున్న అపరిశుభ్ర వాతావరణంలో వారాల తరబడి నిల్వ ఉంచిన ఈ మాంసం నుండి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు షాపు లైసెన్స్ కూడా ఏడాది క్రితమే ముగియడం గమనార్హం.
  • ముషీరాబాద్ & వారసిగూడ: ఇక్కడ 610 కిలోల అపరిశుభ్ర మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు.
  • మంగళహాట్: ఈ నెల 11న జరిపిన దాడుల్లో 300 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని, వ్యాపారి మహ్మద్ అఫ్రోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నిల్వ ఉంచిన మాంసాన్ని తక్కువ ధరలకు హోటళ్లు, రెస్టారెంట్లు, వివాహ వేడుకలకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్ట్రీట్ ఫుడ్.. జాగ్రత్త!

నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. “తక్కువ ధరకే మటన్ భోజనం” అంటూ బోర్డులు పెట్టి, కుళ్లిన మాంసం, నాణ్యత లేని నూనెలను వాడుతున్నట్లు తనిఖీల్లో తేలింది. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం, కాలం చెల్లిన సాస్‌లు వాడటం, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారులకు సూచనలు:

ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు ఇకపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  1. మాంసం కొనేముందు అది తాజాగా ఉందో లేదో సరిచూసుకోవాలి.
  2. పశుసంవర్ధక శాఖ అధికారుల సీలు/స్టాంపు ఉన్న మాంసాన్నే కొనుగోలు చేయాలి.
  3. అతి తక్కువ ధరకు మాంసం విక్రయిస్తున్నారంటే అది నిల్వ ఉంచినది అయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.

అధికారులు కేవలం అప్పుడప్పుడు దాడులు చేయడం కాకుండా, నిరంతర నిఘా ఉంచి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?