Sarkar Live

మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025

Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా

Medaram Jatara 2026

Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం మెరుగైన సౌక‌ర్యాలు కల్పిస్తోంది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తుండ‌గా ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రాతి కట్ట‌డాల‌తో దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ‌

మ‌రోవైపు మేడారం దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టింది. వంద‌లాది ఏళ్ల‌యినా చెక్కుచెద‌ర‌కుండా రాతి క‌ట్ట‌డాల‌తో నిర్మాణం చేప‌ట్టేందుకు మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. 90 రోజుల్లో ప‌నులు పూర్తిచేయాల‌ని డెడ్‌లైన్ పెట్ట‌గా అధికారులు రాత్రింబ‌వ‌ళ్లు చెమ‌టోడ్చుతున్నారు. ఇదే క్ర‌మంలో మ‌హాజాత‌రకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో సాధ్య‌మైనంత వ‌ర‌కు మాస్ట‌ర్‌ప్లాన్ ప‌నుల‌ను పూర్తిచేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ప‌నులు స‌కాలంలో పూర్త‌య్యేందుకు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఫోక‌స్ పెట్టారు. మంత్రులు ధ‌న‌స‌రి సీత‌క్క‌ (Seetakka), కొండా సురేఖ (Konda Surekha)తో క‌లిసి ప‌లుమార్లు మేడారంలో ప‌ర్య‌టించారు. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ముంద‌స్తు మొక్కులు చెల్లించుకుంటున్న భ‌క్తులు

మేడారం మ‌హాజాత‌రకు ఇంకా 54 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు ముంద‌స్తుగానే వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం జాతర రోజుల్లో భారీ రద్దీ (Medaram devotees rush) ఉంటుంది. ఆ సమయంలో గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తుందని భావిస్తూ చాలామంది భక్తులు ముందుగానే వచ్చి దర్శనం చేయడాన్ని ప్రాధాన్యం ఇస్తున్నారు. వేలాది మంది ముంద‌స్తుగా త‌ర‌లివ‌చ్చి మొక్కులు (Medaram Mokkulu) చెల్లించుకుంటున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మేడారానికి తరలివస్తున్నారు. దీంతో అడవుల నడుమ ఉన్న మేడారం ప్రాంతం ఇప్ప‌టి నుంచే భక్తులతో కిట‌కిట‌లాడుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?