Mega Star Chiranjeevi Next movie | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో మెగా 157 మూవీ (Mega 157 movie) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన చిన్నపాటి గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి తెగ రెస్పాన్స్ వచ్చింది. టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకుంటూ విడుదల చేసిన ఆ వీడియో సరికొత్తగా ఉండడంతో ఫాన్స్ ఫిదా అయ్యారు. రాను రాను ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ థ్రిల్ చేస్తాయని అనడంలో సందేహం లేదు.
సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ఎంత బరువు ఉంటుందో అనిల్ రావిపూడికి తెలుసు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.ఇక హీరోయిన్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తనకు తెలుసు. మెగాస్టార్ పక్కన ఎవరైతే కెమిస్ట్రీ బాగుంటుందో తనను ఎంపిక చేసే పనిలో పడ్డాడట.
మెయిన్ హీరోయిన్ గా నయన్..?
ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా అందాల తార నయనతార(nayanthara)ను ఎంపిక చేసినట్టు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది.ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కు కూడా స్కోప్ ఉందట. ఇక ఆ ఎంపికపై రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. రకరకాల హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చినా.. లేటెస్ట్ గా ఆ వరుసలో కేథరిన్ టెస్ర (ketharin tesra) పేరు కూడా వినబడుతుంది.
Mega Star Chiranjeevi మూవీలో సెకండ్ హీరోయిన్ ..?
ఇంతకుముందు మెగాస్టార్ బాబి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలో రవితేజకు జోడిగా నటించి మెప్పించింది. అంతకుముందు గోపీచంద్ రానా, నితిన్,విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసినా ఆ మూవీల్లో నటిగా మంచి మార్కులే పడ్డ అవి సరిగా ఆడక పోవడంతో ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.
ఇక మెగాస్టార్ తో ఈ ఛాన్స్ రావడం అనేది తన లక్ అని సినీవర్గాలు అనుకుంటున్నాయి. ఏదేమైనా మెగాస్టార్ కాంబినేషన్లో కేథరిన్ ఒక్క డాన్స్ చేసిన కూడా తన దశ తిరిగిపోయినట్లేనని సినీ లవర్స్ అంచనా వేస్తున్నారు. కేథరిన్ ఎంపికపై మూవీ టీం తొందరలోనే అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. జూన్ లో ప్రారంభమయ్యే ఈ మూవీ కేథరిన్ కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    