Vishvambhara Movie Update | తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఒక శిఖరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీపై దర్జాగా కూర్చున్నారు. మెగాస్టార్ నుండి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే తను ఏం చేసినా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమనిపిస్తుంది. డాన్స్ లో,కామెడీలు, ఫైట్స్ లో తనదైన మార్క్ ని చూపెట్టి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తను వేసినన్ని స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేదు. దీనికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. డాన్స్ లే కాదు అప్పుడప్పుడు పాటలు పాడి కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాడు.
లేటెస్ట్ గా వశిష్ట మల్లిడి (Vasishta mallidi) డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మూవీలో చిరు లుక్ చూస్తే వింటేజ్ చిరును చూస్తున్నట్టు ఉందనడంలో సందేహం లేదు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవికి ఎంఎం కీరవాణి(MM keeravaani)మ్యూజిక్ అందిస్తున్నారు. ఆపద్బాంధవుడు,ఘరానా మొగుడు లాంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండడంతో పాటలు ఓ రేంజ్ లో అదిరిపోయాయినట్టు తెలుస్తుంది.
చిరు అప్పుడెప్పుడో…
మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలో పాటలు కూడా పాడుతుంటాడు.మాస్టర్ సినిమాలో అరె తమ్ముడు అరె తమ్ముడు అనే పాట, తర్వాత వచ్చిన మృగరాజు సినిమాలో చాయ్ చమకురా తాగరా బాయ్ అనుకుంటూ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాడు. మధ్య మధ్యలో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో కూడా తన గాత్రాన్ని అందించాడు.
Vishvambhara : చాలా ఏళ్ల తర్వాత చిరు గాత్రం…
చాలా ఏళ్ళ తర్వాత విశ్వంభరలో చిరు ఒక సాంగ్ కూడా పాడబోతున్నాడట. చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ సాంగ్ పాడటంతో చిరు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.త్వరలోనే ఈ మూవీ నుండి సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా చిరు గాత్రాన్ని మరోసారి వినబోతుండడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రీ ఎంట్రీ తర్వాత వచ్చిన మూవీస్ లో చిరు మునుపటి హవా చూపించట్లేదు అన్నవారికి విశ్వంభరతో సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది లోనే విడుదల కానుంది. టీజర్ విడుదల చేస్తే నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీం సీజీలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫ్యాన్స్ మాత్రం విశ్వంభర (Vishvambhara Move Release Date) ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.