- ప్రీస్కూల్ చిన్నారులకు రోజూ 100 మి.లీ పాలు పంపిణీ ప్రారంభం
- పైలెట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లా.. దేశంలోనే తొలిసారి
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
New Anganwadi Program Started in mulugu | తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి, పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయడం మొదలైంది.
ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ముందుకుసాగుతోందని అన్నారు. వెనుకబడిన ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది తల్లితండ్రులను కలిసి అంగన్వాడీకేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు.
అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలి వివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఆనం మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్ల అభివృద్ధికి విఘాతం అని, కానా బాల్య వివాహాలను అడ్డు ములుగును బాల్యవివ్ రా జిల్లా గా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPO లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







