కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 1, KGF 2) మూవీలతో ఒక్కసారిగా ఇండియన్ సినీ ఆడియన్స్ ని తన వైపునకు తిప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi basroor). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి తనదైన మ్యూజిక్ ఇచ్చి ఆ మూవీస్ హిట్టులో కీల పాత్ర పోషించాడు. తన సూపర్ మ్యూజిక్ తో సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన సలార్ (Salaar) మూవీకి కూడా ఎక్స్లెంట్ గా మ్యూజిక్ ని ఇచ్చి మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్టు అయ్యేలా చేశాడు.
అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టి తీసిన వీర చంద్రహాస (Veera chandrahasa) అనే మూవీ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది. కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ మూవీకి కూడా తనే మ్యూజిక్ అందించాడు. యక్షగానం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీలో స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar)కూడా ఒక స్పెషల్ క్యామియో రోల్ చేయడం విశేషం.శివరాజ్ కుమార్ ఈ మూవీలో యాక్ట్ చేయడంతో మూవీపై మంచి బజ్ నెలకొంది.
ఈ నెల 25న..
అయితే కన్నడలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న వీరచంద్ర హాసను మేకర్స్ తెలుగులోకి కూడా అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేశారు. ఈనెల 25న తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. స్టోరీలో మంచి ఎమోషన్స్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఏ భాష మూవీ నైనా హిట్టు చేయడంలో ముందుంటారు. ఇదివరకు వచ్చిన ఎన్నో సినిమాలు కూడా వారికి నచ్చితే నేరుగా వచ్చిన తెలుగు సినిమాల కంటే మిగతా భాషల సినిమాల నే ఎక్కువగా ఆదరించారు.
Ravi basroor జాతకం మారిపోయినట్టే..?
తెలుగు ఆడియోన్స్ కి ఈ మూవీ నచ్చిందంటే చాలు రవి బస్రూర్ (Ravi basroor) జాతకం మారిపోయినట్టేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ కనుక హిట్ అయితే తెలుగులో స్టార్ట్ హీరోల నుంచి మరిన్ని అవకాశాలు రావొచ్చు అంటున్నారు. ఏదేమైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ మూవీని తీసి అది పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుండడం అది తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండడం హర్షించదగిన విషయం. మరి రవి బస్రూర్ తీసిన వీర చంద్రహాస ను తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు చూడాలి మరి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.