Mutton Fish rates Hike in Telangana : హైదరాబాద్‌లో మాంసం, చేపల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో చికెన్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. బ్లర్డ్‌ఫ్లూ భయం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక జనం చికెన్‌ను వదిలి మటన్, ఫిష్‌నే తింటున్నారు. దీంతో కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు, చికెన్ షాపుల యజమానులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు.
Mutton Fish rates jump : చికెన్ వినియోగం పడిపోవడం వల్లే
హైదరాబాద్‌లో చికెన్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మటన్, చేపల ధరలు పెరుగుతాయి. చికెన్ ధరలు తగ్గుతుండగా, మటన్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఒకప్పుడు చికెన్ ధరలు స్థిరంగా ఉండేవి. ఇటీవల బర్డ్ ఫ్లూ భయాలు పెరగడంతో ప్రజలు చికెన్ కొనుగోలు చేయడం తగ్గించారు. దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. గత వారం రోజుల్లో మటన్ కొనుగోలు 40 శాతం పెరిగిందని షాప్ యజమానులు చెబుతున్నారు. దీనివల్ల ధరల్లో 17% పెరుగుదల నమోదైంది. వారం క్రితం కిలో మటన్ రూ. 850 ఉండగా, ప్రస్తుతం రూ. 1000 కి చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో చేపల రేట్లు రూ. 50-100 వరకూ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
వివాహ వేడుకలపై ప్రభావం
హైదరాబాద్‌లో వివాహ వేడుకల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ముందుగా చాలా మంది వివాహ భోజనం మెనూలో చికెన్‌ను చేర్చేవారు. బర్డ్ ఫ్లూ భయాలతో ఇప్పుడు మటన్, చేపలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంతకు ముందు, వివాహ వేడుకల్లో, ఇతర ఫంక్షన్లలో ఎక్కువగా చికెన్ వంటకాలను ఆర్డర్ చేసేవారమని, ఇప్పుడు ప్రజలు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారని క్యాటరింగ్ నిర్వాహకులు అంటున్నారు.
ఈ పరిస్థితి ఎప్పటి వరకు?
బ్లర్డ్‌ఫ్లూ (BirdFlu) భయాలు ఇంకెంత కాలం కొనసాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. చికెన్ అమ్మకాలు మందగించడం, మటన్, చేపల ధరలు (Mutton Fish rates) విపరీతంగా పెరగడంపై జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ బట్టి చూస్తే మటన్, చేపల వినియోగం పెరుగుతూనే ఉంది. ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మంచి మాంసాహారాన్ని ఎంచుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ భయాలు తగ్గితేనే చికెన్ మళ్లీ తన స్థాయికి చేరుకోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







