పదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వృద్దుడికి 24 ఏళ్ల జైలు
Nalgonda News | అభంశుభం తెలియని పదేళ్ల బాలికపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడైన వృద్ధుడు నల్లగొండ (Nalgonda ) మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య (60)కు పోక్సో కోర్టు (POCSO Court) 24ఏళ్ల జైలు శిక్ష (24 Years Jail Sentence) విధించింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే.. 2023 మార్చి 28న నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక బడికి వెళ్లి ఇంటికి వచ్చి నిద్రపోతున్న సమయంలో ఊషయ్య అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బాలికకు తిను బండారాలు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బాలికను బెదిరించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి 2023 మార్చి 29న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ( SHO) కంచర్ల భాస్కర్ రెడ్డి నిందితుడు ఊషయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండేండ్ల విచారణ అనంతరం POCSO Incharge న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి సెప్టెంబర్ 16న మంగళవారం తుది తీర్పు వెలువరించారు.
ఈ కేసు లో ముద్దాయికి 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే రూ.40,000 జరిమానా విధించారు. బాధితురాలికి 10,00,000 పరిహారం ప్రకటించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐ.వోలుగా కంచర్ల బాస్కర్ రెడ్డి, వి.నర్సింహారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన, కోర్టు కానిస్టేబుల్ దుర్గ రాజు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








