నాచురల్ స్టార్ నాని (Natural Star Nani) చాలా ప్లాన్డ్ గా మూవీస్ చేస్తూ హిట్టు కొడుతుంటారు. తన కెరియర్లో రాజమౌళి(Rajamouli), కృష్ణవంశీ, గౌతమ్ మీనన్ లాంటి డైరెక్టర్ లతో పనిచేశారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. తన నేచురల్ నటనతో ఇండస్ట్రీ (Tollywood Film industry)లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో హిట్స్ అందుకున్న నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలల(Srikant Odela)తో ప్యారడైజ్ (Paradise) అనే మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా నడుస్తోంది. ఇదివరకు వీరి కాంబినేషన్లో దసరా మూవీ వచ్చి సూపర్ హిట్టు అయింది.
శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్..
నాని గత చిత్రం హాయి నాన్న (Hi Nanna) మంచి విజయాన్ని సాధించింది. హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నాడు. విశ్వక్సేన్ హీరోగా హిట్ మూవీని నిర్మించాడు.అలాగే దానికి కొనసాగింపుగా అడవి శేషు హీరోగా హిట్-2 మూవీని నిర్మించగా అది కూడా సూపర్ హిట్టు అయింది. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా హిట్ -3 రాబోతుంది. దీనిలో నాని నే హీరోగా నటీస్తున్నాడు. ఈ మూవీ చేస్తూనే శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.
Nani Next Movie : శేఖర్ కమ్ములతోనేనా..
ఇక లేటెస్ట్ గా నాని తర్వాత నటించబోయే సినిమాపై ఫిలిం నగర్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సెట్స్ మీద రెండు సినిమాలు వుండగానే మరో మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రేమకథల ను ఎలాంటి వల్గారిటీ లేకుండా అందంగా చెప్పే శేఖర్ కమ్ముల (Nani Movie with Shekhar Kammula )తో నాని మూవీ చేయబోతున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల మూవీస్ అంటేనే న్యాచురల్ గా ఫీల్ గుడ్ లా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో నాచురల్ స్టార్ నటిస్తున్నాడంటే అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి.
ఫ్యాన్స్ అయితే ఇప్పటివరకు నాని చేసిన సినిమాలతో ఒక మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తే నటుడిగా తనకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్(Dhanush) హీరోగా కుబేర అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు ఇంత బడ్జెట్ లో ఆయన మూవీని తీయలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీలో ధనుష్, కింగ్ నాగార్జున (nagarguna) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సారి ఆయన ఫార్మూలాకి దూరంగా వెరైటీ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు.
నిజానికి Nani, Shekhar Kammula వీరి కాంబోలో మూవీ వస్తే చూడాలని ఫాన్స్ కి ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. అది నెరవేరే టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల నాని ఇమేజ్ కి తగ్గట్టుగా తనదైన మార్క్ ఉండేలా ఒక స్టోరీని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.వీరిద్దరూ ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.ఆ మూవీస్ పూర్తయ్యాక మూవీపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఫిలిం నగర్ (Film Nagar)లో చక్కర్లు కొడుతున్న ఈ కంబోపై నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







