- వేల క్వింటాళ్ల సర్కారు ధాన్యం మాయం!
- ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అధికారులు విస్తుపోవాల్సిందే
Narsampet Rice Mill Scam | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖ రైస్ మిల్లు ‘అరవింద’ ఇప్పుడు తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిల్లులో కనిపించకపోవడం (Rice mill Paddy Missing) స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డులకు, మిల్లులోని అసలు నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ‘ధాన్యం ఆవిరైందా? లేక అమ్మేశారా?’ అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Rice Mill Scam : అసలేం జరిగింది?
ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి పౌరసరఫరాల శాఖకు (CMR రూపంలో) అప్పగించే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.
2025-26 ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అరవింద మిల్లుకు కేటాయించింది. సదరు మిల్లర్ ధాన్యాన్ని మరాడించి 59 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటే పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉంటుంది. మిల్లర్ ఇప్పటివరకు సుమారు 40 కి పైగా ఏసికే ల బియ్యం ప్రభుత్వానికి బాకీ ఉంది అసలు ట్విస్ట్ ఏమిటంటే 40 ఏసికెలకు సరిపడా ధాన్యం ఆ మిల్లులో లేకపోవడం గమనార్హం.
బహిరంగ మార్కెట్కు తరలిందా?
మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలు భారీగా తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చాల్సిన సదరు మిల్లర్, అధికారుల కళ్లు గప్పి ఆ ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో ముడిపడి ఉన్న కోట్లాది రూపాయల విలువైన ధాన్యం ఇలా మాయమవ్వడం వెనుక పెద్ద కుంభకోణం జరిగిఉండొచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే విస్తుపోవాల్సిందే…
నర్సంపేట లోని అరవింద రైస్ మిల్లులో జరుగుతున్న ఈ గోల్మాల్పై వరంగల్ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. “మిల్లులో తక్షణమే ఫిజికల్ వెరిఫికేషన్ (PV) నిర్వహిస్తే, అసలు ఎంత ధాన్యం మాయమైంది? ఎంత మేర అవినీతి జరిగింది? అనే విషయాలు వెలుగులోకి వస్తాయి.” ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, సర్కారు ధాన్యం మాయం చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








