Hit 3 Movie : నేచురల్ స్టార్ నానీ (Natural Star Nani) కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి కుర్రాడి కేరక్టర్ లే చేశాడు. కానీ రాను రాను ఫుల్ మాస్ హీరోగా మారాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ లో ఎంత మాస్ కేరక్టర్ చేశాడో మనం చూశాం. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో మూవీ పారడైజ్ (paradise) చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దసరా (dasara) లాంటి బంపర్ హిట్టు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిలో కూడా పుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నానీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ -3 (HIt the third case) టీజర్ లో మాస్ కొద్దిగా ఎక్కువగానే చూపించినట్టు తెలుస్తోంది.
నెక్స్ట్ లెవల్ యాక్టింగ్…
Hit 3 Movie పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వస్తున్న ఈ మూవీ స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందులో నానీ నటించిన హిట్-3 టీజర్ వేరే లెవల్ లో ఉంది. వయోలెన్స్ ఉంటుందనుకున్నా ఈ రేంజ్ లో ఉండడం ఊహించి ఉండరు.నానీ అర్జున్ సర్కార్ గా ఒక పవర్ ఫుల్ పోలీస్ కేరక్టర్ లో లాఠీ విధిలించండం చూస్తే ఫస్ట్ టైం నానీ ని ఇంత పవర్ ఫుల్ గా చూస్తున్నామనిపిస్తుంది.అటువంటి క్యారెక్టర్ ఉన్న అతడికి ఒక దగ్గర సీరియల్ మర్డర్ లు జరిగితే అది ఎవరు చేస్తున్నారో వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
అంత రూడ్ గా ఉండడం నేరస్థులకు హడలు పుట్టించే విధంగా ఉన్నాడు. ఆఖరులో అయితే వైట్ కొట్ వేసుకుని ఒకతన్ని క్రూరంగా చంపడం చూస్తే ఆడియన్స్ కి ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. నానీని ఇంత ఫుల్ మాస్ అవతారంలో ఊహించని విధంగా ఉన్నాడు.సీనియర్ యాక్టర్ రావు రమేష్ కూడా ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేయడం, టీజర్ లో అతడు చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ (mikky j mayer) పనిచేశాడు. అతడి బీజీఎం కూడా టీజర్ ని నెస్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.
మే 1 న గ్రాండ్ రిలీజ్..
Hit 3 Movie Release date : ఇక నాని ఆయన ప్రొడ్యూసర్ గా మారి తీసిన హిట్ ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్ ది సెకండ్ కేస్ మూవీని నిర్మించి మరో సూపర్ హిట్టుని ప్రొడ్యూసర్ గా తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో అడవి శేషు హీరోగా యాక్ట్ చేయడంతో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు హిట్ సిరీస్ లో మరో విజయం సాధించింది. ఇందులో క్లైమాక్స్ లో నానీ కనిపించి హిట్ ది థర్డ్ కేస్ వస్తుందని అప్పుడే హింట్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మూవీని స్టార్ట్ చేశారు. హిట్ సిరీస్ రెండు మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. Hit 3 Movie మే 1 (May 1) న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..