Sarkar Live

Nani | తల్వార్లు పట్టిన కాకుల కథ… అదిరిన ది పారడైస్ మూవీ గ్లిమ్స్

నేచురల్ స్టార్ నాని (natural Star Nani) ఇటీవల హిట్ -3 టీజర్ తో వచ్చి అలరించాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) డైరెక్షన్ లో ఎస్ఎల్వి ప్రొడక్షన్లో చెరుకూరి సుధాకర్ (cherukuri sudhakar) నిర్మిస్తున్న ది పారడైజ్ మూవీ (The

natural Star Nani

నేచురల్ స్టార్ నాని (natural Star Nani) ఇటీవల హిట్ -3 టీజర్ తో వచ్చి అలరించాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) డైరెక్షన్ లో ఎస్ఎల్వి ప్రొడక్షన్లో చెరుకూరి సుధాకర్ (cherukuri sudhakar) నిర్మిస్తున్న ది పారడైజ్ మూవీ (The Paradise) గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. దసరా మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆడియన్స్ లో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన దసరా మూవీ నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోయింది.

Nani , శ్రీకాంత్ ఓదెల కాంబోలో రెండో మూవీ..

ఈ మూవీతో నాని యాక్టర్ గా నిరూపించుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాడు. దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచిపోయింది. ఫస్ట్ సినిమాతోనే ఇంతటి బిగ్గెస్ట్ హిట్టు అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని మరో మూవీ ఆపర్చునిటీ ఇచ్చాడు. దీంతో ఈసారి డిఫరెంట్ క్యారెక్టర్ లో నానిని ప్రజెంట్ చేయబోతున్నాడని గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఆడియన్స్ ఊహించని విధంగా,ఇలా కూడా మూవీ తీస్తారా అన్న విధంగా గ్లిమ్స్ ఉంది.

చరిత్రలో చిలుకలు,పావురాల గురించి రాశిర్రు గాని గదే జాతిలో వుట్టిన కాకుల గురించి రాయలే… గిది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచిన శవాల కథ అన్నప్పుడు చుట్టూ మంటలు వాటి మధ్యన శవాలు,పైన కాకులు తిరగడం చూస్తే దేని కోసమో కొందరిపై కొందరు దాడి చేసి వారికి అడ్డొస్తే వారిని చంపేస్తారని తెలుస్తోంది. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ, ఒక్క దగడొచ్చి మొత్తం జాతుల జోష్ తెచ్చిం డు. తూ అనిపించుకున్న కాకులు తల్వార్ లు పట్టుకున్నయి..ఇది కాకులను ఒక్కటి చేసిన ఒక లం…కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ అంటూ చెప్పిన ఈ డైలాగ్ ఆడియన్స్ కి మూవీపై ఎక్స్ పెక్టేషన్ ని విపరీతంగా పెంచేసింది. ఆ కొందరిని కాపాడడానికి ఒకడు వచ్చి వారిలో ధైర్యం నూరిపోసే నాయకుడవుతాడని అర్థమవుతుంది. ఈ మూవీతో నాని యాక్టర్ గా మరొక రూపం చూపెట్టబోతున్నాడు.

నటుడిగా మరో మెట్టు..

గ్లిమ్స్ లో చూపెట్టిన అలాంటి టాటూను వేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. నాని ఈ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకొని నటుడిగా మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. గ్లిమ్స్ లో నాని ఫేస్ అగుపడకుండా రెండు జడలు వేసుకున్నట్టు చూపెట్టడంతో పవర్ ఫుల్ రోల్ లో చూపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీతో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మరొకసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని నాని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గ్లిమ్స్ లో అనిరుద్ అందించిన బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల ఈసారి గట్టి హిట్ కొట్టబోతున్నట్లు అర్థమవుతుంది. మార్చి 26 2026న మూవీ విడుదల కాబోతున్న ఈ మూవీకి ఎడిటర్ గా నవీన్ నూలి, జీ కే విష్ణు సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!