Sarkar Live

Nayanthara | చిరు మూవీలో నయన్…

Nayanthara in chiru movie | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi Anil ravipudi combo) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ వైరల్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో

Nayanthara

Nayanthara in chiru movie | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi Anil ravipudi combo) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ వైరల్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ 300 కోట్లు కొల్లగొట్టి వెంకటేష్(venkatesh) కెరీర్ లోనే కాదు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

ప్రజెంట్ అనిల్ మెగాస్టార్ చిరుతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ పై ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చిరు కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్లో కామెడీ సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టే డైరెక్టర్ల లో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు.

మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత అన్ని సీరియస్ సబ్జెక్టులని ఎంచుకున్నారు.ఒక్క వాల్తేరు వీరయ్య మూవీ తప్ప మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా ఒక్క మూవీ కూడా లేదని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. వింటేజ్ చిరును చూడాలని ఉందని మంచి కామెడీ ఎంటర్టైనర్ కావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.

Nayanthara : రెండో వీడియో అదిరింది…

ఫ్యాన్స్ కోరిక మెగాస్టార్ కు చేరిందో ఏమో గానీ ఇప్పుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో పూర్తి ఎంటర్టైనర్ మూవీ తీయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిల్ రావిపూడి తీసే ప్రతీ మూవీకి కూడా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఈ మూవీకి పనిచేసే సాంకేతిక నిపుణులు ఎవరు పనిచేస్తున్నారో చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ముచ్చటగా మూడోసారి….

కొన్ని రోజులుగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరా అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. అనిల్ రావిపూడి స్టైల్ లోనే హీరోయిన్ ను పరిచయం చేసే వీడియో ను మూవీ టీం రిలీజ్ చేసింది. చిరు సరసన అందాల తార నయనతార (nayanthara) ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కావడంతో ఇలా ఒక్కో వీడియోలతో ఆడియోన్స్ లో హైప్ పెంచుతున్నాడు. ఈ రెండో వీడియోతో హీరోయిన్ నయనతారను తీసుకున్నట్లు తెలిపిన వీడియో వైరల్ అవుతూనే ఉంది. షైన్ స్క్రీన్ పై (shine screens entertainment bannar) సాహు గార్లపాటి,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!