Sarkar Live

New Traffic Rule | ఐదుసార్లే చాన్స్‌.. ఆపై లైసెన్స్ ర‌ద్దు : ట్రాఫిక్ కొత్త రూల్

New Traffic Rule : తెలంగాణ (Telangana) రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ రూల్స్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences)ను శాశ్వ‌తంగా ర‌ద్దు (permanently revoke

New Traffic Rule

New Traffic Rule : తెలంగాణ (Telangana) రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ రూల్స్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences)ను శాశ్వ‌తంగా ర‌ద్దు (permanently revoke driving licence) చేయ‌నుంది. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (elangana transport minister Ponnam Prabhakar) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి భ‌ద్ర‌త‌ను పెంచే దిశ‌గా ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

వాహ‌నాల రిస్ట్రేష‌న్లు కూడా ర‌ద్దు

లైసెన్స్ రద్దు చేయడం అనేది ఇప్పటి వరకు తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు ఒకే వ్యక్తి ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అతనికి తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences) పొంద‌డం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా నిబంధనలు పాటించని డ్రైవర్ల వాహనాలను రిజిస్టర్ చేయడం కూడా రద్దు (vehicles would not be registered) చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ప్రమాదాలు (increases the risk of accidents), నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి (driver) సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

రోడ్డు భద్రతకు AI టెక్నాలజీ

రవాణా శాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రోడ్డు భద్రతను పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కృత్రిమ మేధస్సు (Artificial intelligence (AI)ను ఉపయోగించి వాహన ఫిట్‌నెస్ పరీక్షలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. AI టెక్నాలజీ ఉపయోగం ద్వారా వాహనాల స్థితిని క‌చ్చితంగా పరీక్షించొచ్చు. మోసపూరితంగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు పొందే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నకిలీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లతో వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడం వల్ల ప్రమాదాల రిస్క్ పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?