Sarkar Live

HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం

Hyderabad Central University (HCU) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే “NIRF (National Institutional Ranking Framework) 2025” ర్యాంకింగ్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా విద్యా సంస్థల నాణ్యత, ఫ్యాకల్టీ, పరిశోధన, విద్యార్థుల

HCU

Hyderabad Central University (HCU) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే “NIRF (National Institutional Ranking Framework) 2025” ర్యాంకింగ్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా విద్యా సంస్థల నాణ్యత, ఫ్యాకల్టీ, పరిశోధన, విద్యార్థుల పనితీరు వంటి అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ఏడాది విడుదలైన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో 5వ స్థానాన్ని HCU దక్కించుకుంది. ఇది తెలంగాణలో నంబర్ వన్ కేంద్ర విశ్వవిద్యాలయం కావడమే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది.

టాప్ 10 విశ్వవిద్యాలయాలు :

  1. IISc బెంగళూరు
  2. JNU, ఢిల్లీ
  3. జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ
  4. BHU, వారణాసి
  5. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)
  6. కలకత్తా విశ్వవిద్యాలయం
  7. అమృత విశ్వ విద్యాపీఠం
  8. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
  9. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
  10. సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం

ఓవర్‌ఆల్ కేటగిరీలో టాప్ 10 సంస్థలు:

  1. IISc బెంగళూరు
  2. IIT మద్రాస్
  3. IIT ఢిల్లీ
  4. IIT బాంబే
  5. IIT ఖరగ్‌పూర్
  6. IIT కాన్పూర్
  7. AIIMS ఢిల్లీ
  8. IIT రూర్కీ
  9. IIT గువాహతి
  10. JNU, ఢిల్లీ

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!