Sarkar Live

Odela 2 | ఓదెల 2 మూవీ ఎలా ఉంది?

Odela 2 Review | ఓదెల రైల్వే స్టేషన్ (odela)మూవీ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుసు. దీనికి సీక్వెల్ గా డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా,రచయితగా,ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల -2(odela-2) మూవీ తెరకెక్కింది.పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన

Odela 2

Odela 2 Review | ఓదెల రైల్వే స్టేషన్ (odela)మూవీ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుసు. దీనికి సీక్వెల్ గా డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా,రచయితగా,ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల -2(odela-2) మూవీ తెరకెక్కింది.పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….

కథ..

ఓదెల అనే ఊరిలో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని తిరుపతి అనే వ్యక్తి అత్యాచారాలు చేసి చంపుతుంటాడు.ఒకరోజు అతడి భార్య రాధ తనని చంపి జైలుకు వెళ్తుంది.ఇది మొదటి భాగం….ఊరి వాళ్ళు తిరుపతి చనిపోయాడని సంబరపడిపోతారు. కానీ అతడు ప్రేతాత్మగా మారి ఊళ్ళో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపుతాడు. దీంతో మళ్లీ ఊరు భయపడుతుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న తిరుపతి ప్రేతాత్మ తో ఊరి జనం ఎలా ఇబ్బంది పడింది.ఓదెల గ్రామాన్ని కాపాడడానికి వచ్చిన నాగసాదువుకి ప్రేతాత్మ కీ మధ్య ఎలా యుద్ధం జరిగిందనేది కథ…

Odela 2 : మూవీ ఎలా ఉందంటే…

ప్రేతాత్మకు దైవ శక్తికి యుద్ధం అనేది ఎప్పటి నుండో ఉన్న ఫార్ములానే. ఈ టైప్ లో వచ్చిన మూవీస్ ని ఆడియన్స్ బాగా ఇష్టపడుతారు.ఇక ఈ మూవీ విషయానికి వస్తె ఓదెల ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుండే మూవీ స్టార్ట్ అవుతుంది.మొదటి పార్ట్ కంప్లీట్ గా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కానీ ఈ మూవీ హారర్ థ్రిల్లర్ గా ప్రేతాత్మకు దైవ శక్తికి మధ్య యుద్ధాన్ని చూపెట్టారు. తిరుపతి ప్రేతాత్మ గా మారి ఊరి వాళ్ళను భయపెట్టడం లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మూవీలోని కొన్ని సన్నివేశాలు వేరే సినిమాలను గుర్తుకు తెస్తుంది. రచయిత,దర్శకుడు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.ప్రేక్షకుడు ఎంతగానో ఎదురుచూసే భైరవి పాత్రను లేట్ గా తీసుకురావడంతో కొద్దిగా డిసపాయింట్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ వరకు కొద్దిగా బానే ఉందని అనిపించినా సెకండాఫ్ లో నాగసాదువు భైరవి, ప్రేతాత్మ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆడియన్స్ వేరే మూవీని పోల్చుకోవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ మాత్రం ఈ మూవీకి ప్లస్ పాయింట్ .

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…

సంపత్ నంది (Sampath nandi) నిర్మాతగా ఒకే అనిపించుకున్నా..దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలపై, స్క్రిప్ట్ పరంగా మరింత ఫోకస్ చేస్తే బాగుండేదనిపించింది.డైరెక్టర్ అశోక్ తేజ (Ashok Teja)తనకున్న అనుభవంతో ఇలాంటి స్టోరీ ని తెరకెక్కించడంలో మంచి మార్కులే కొట్టాడు.కొన్ని సన్నివేశాలను డిఫరెంట్ గా తీయడానికి ప్రయత్నిస్తే మూవీ మరో లెవెల్ కి వెళ్లేదనిపించింది. ఇక ఈ మూవీలో నాగసాధువు తమన్నా(thamanna), విలన్ పాత్రలో వశిష్ట(Vasishta)అదరగొట్టారు. వీరిద్దరి పాత్రలే మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు. హెబ్బా పటేల్(hebba patel)రోల్ చిన్నదైన బానే ఉంది. మురళీ శర్మ (Murali sharma)మిగతా నటీనటులు కూడా వారి పాత్రల మేరకు బానే నటించారు. అజనీష్ లోక్నాథ్(Ajaneesh loknath) ఇచ్చిన పాటలు ఒకే అనిపించుకున్నా బీజేఏం మాత్రం ఎక్స్ట్రార్డినరీ గా ఉంది. సీన్స్ ని మరింత ఎలివేట్ చేసే విధంగా బీజీఎం ఇవ్వడంలో అజనీష్ సూపర్ అనిపించుకున్నాడు.నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ వర్క్ కూడా బానే ఉంది.ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే వేరే మూవీస్ గుర్తుకు రాకుండా తీయడానికి ప్రయత్నిస్తే ఓదెల ఫస్ట్ పార్ట్ లా ఎక్స్ట్రార్డినరీ గా ఉండేదని ఆడియన్స్ అనుకుంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!