Sarkar Live

Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

Oil Palm Factory

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్‌ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది.

ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో తొలిసారి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ ఫ్యాక్టరీ ద్వారా రైతులకు నేరుగా లాభాలు చేకూరనున్నాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు, స్థల ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయనుంది. ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు, సాగులో ప్రోత్సాహం లభించనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!