Pahalgam attack : జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యతను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై పలు ఆంక్షలను విధించింది.
Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు
ఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ‘Persona Non Grata’ అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగా ప్రకటించింది. వారందరికీ భారత్ విడిచిపెట్టి వెళ్లేందుకు ఏడు రోజులు సమయం ఇచ్చింది.
Persona Non Grata అంటే ఏమిటి?
Persona Non Grata అనేది లాటిన్ పదం. ‘అనవసర వ్యక్తి’ అని దీని అర్థం. అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఇది ఓ దేశంలో ఉన్న విదేశీ రాయబారిని ఆ దేశం ఇకపై అంగీకరించదన్నదానికి సూచనగా ఉపయోగిస్తారు. భారత్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఈ నోటీసుతో పాక్ రాయబారు బృందం ఇక భారత్‌లో ఉండేందుకు వీల్లేదు.
CCS అత్యవసర సమావేశం
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (Cabinet Committee on Security (CCS) సమావేశమైంది. హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు ఇందులో పాల్లొని సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కీలక నిర్ణయాలు ఏమిటంటే..
- ఢిల్లీలోని పాక్ రాయబారిలో పనిచేస్తున్న రక్షణ, నౌకా, వైమానిక సలహాదారులందరిని Persona Non Grataగా ప్రకటించి వారిని దేశం విడిచి వెళ్లమన్నారు. భారత ప్రభుత్వం కూడా ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిలో పనిచేస్తున్న తమ రక్షణ, నౌకా, విమాన సలహాదారులను వెనక్కి పిలిపించుకుంటుంది. రెండు దేశాల్లో ఉన్న సేవా సిబ్బందిలో ఐదుగురిని కూడా వెనక్కి పిలవనుంది.
- పంజాబ్‌లోని అటారి చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆ మార్గంలో వచ్చిన పాకిస్తాన్ పౌరులు మే 1లోపుగా తిరిగి వెళ్లొచ్చని తెలిపారు.
- పాకిస్తాన్ పౌరుల కోసం అందిస్తున్న SAARC Visa Exemption Scheme (SVES)ను రద్దు చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన వీసాలు అంతే విధంగా రద్దయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీసాలతో భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.
- 1960లో భారత్-పాక్ మధ్య జరిగిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాక్ క్రాస్‌బోర్డర్ టెర్రరిజాన్ని పూర్తిగా విడిచిపెట్టే వరకు ఈ ఒప్పందాన్ని అమలు చేయబోమని భారత్ స్పష్టం చేసింది.
- మే 1, 2025లోపుగా ఇరు దేశాల రాయబారాల్లో ఉద్యోగుల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించనున్నట్లు ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








1 Comment
[…] పహల్గాం (Pahalgam) దాడి కేసులో ప్రధాన నిందితుడ9 ఆదిల్ హుస్సేన్ తొకార్ , మరో అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు సోదాలు చేశాయి. తనిఖీలు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఇద్దరూ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba )కు చెందినవారేనని తెలుస్తోంద. పేలుళ్లలో ఇద్దరి ఇళ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు తనిఖీకి వచ్చినప్పుడు పేల్చేందుకు ముందుగానే బాంబులు అమర్చి ఉంచినట్లు అక్కడి దృశ్యాన్ని చూస్తుంటే స్పష్టమవుతోంది. […]