Sarkar Live

Pattudala Movie Review | ఫ్యాన్స్ కు నచ్చే పట్టుదల..

Pattudala Movie Review | తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith), త్రిష (Trisha) జంటగా నటించిన మూవీ విడాముయర్చి. ఈ మూవీని తెలుగులో పట్టుదల (Pattudhala) అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్లో ఎలా ఉంటుందో

Pattudala Movie Review

Pattudala Movie Review | తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith), త్రిష (Trisha) జంటగా నటించిన మూవీ విడాముయర్చి. ఈ మూవీని తెలుగులో పట్టుదల (Pattudhala) అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.
అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి మూవీ వస్తుందంటే తమిళ్ సినిమా అనుకోరు… తెలుగు సినిమా లాగానే ఆడియన్స్ ఆదరిస్తారు. ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…

Pattudala Movie Review : పట్టుదల మువీ కథేంటీ?

పట్టుదల మూవీని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. స్టోరీ మామూలుదే అనిపించినా డైరెక్టర్ మాగీజ్ తిరుమేని (magiz thirumeni) టేకింగ్ కొత్తగా ఉంటుంది. మూవీలో అజిత్ లుక్ అదిరిపోతుంది. ఇక ఆయన పర్ఫామెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది అర్జున్ అనే క్యారెక్టర్ లో రఫ్ఫాడించాడు. త్రిష ,అజిత్ మధ్యలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. మూవీలో వీరిద్దరి మధ్య లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.

అజిత్ లాంటి మాస్ హీరో మూవీకి ఆడియెన్స్ ఏం ఎక్పెక్ట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ లో చూపించలేదు. ఆడియన్స్ ఊహించినట్టుగా ఉండకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ గా ఫీలయ్యారనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఆ సీన్స్ ని కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. డైరెక్టర్ ఇంకా బలంగా రాసుకుంటే అవి ఇంకా ఎలివేట్ అయ్యేవి. మూవీకి అవి మరింత ప్లస్ అయి ఉండేది. ఆడియన్స్ కొన్ని చోట్ల బోర్ గా ఫీల్ అయ్యేలా సాగదీత సీన్లు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీశారు. ఆ సీక్వెన్స్ లను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. రియలిస్టిక్ గా కొన్ని సీన్లు ఉండడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

మూవీలో అర్జున్, రెజీనాల క్యారెక్టర్లు పర్వాలేదనిపించాయి. అర్జున్, అజిత్ ల మధ్య సీన్స్ ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. విలన్ క్యారెక్టర్ ని ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో.ఏ మూవీలోనైనా హీరో క్యారెక్టర్ కి తగ్గట్టుగా విలన్ క్యారెక్టర్ ఉండాలి. అంత బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర పండుతుంది.ఈ విషయంలో అది లోపించిందనిపించింది.

ఇక అనిరుద్ మ్యూజిక్ తేలిపోయిందని చెప్పొచ్చు. ఒక్క పాట కూడా ఆడియన్స్ కి ఎక్కలేదు. పైగా తనిచ్చిన
బీజీఎం ఇంతకుముందు మూవీస్ లో తనిచ్చిన రేంజ్ లో లేదు. సీన్స్ ని ఎలివేట్ చేసేలా అయితే కొట్టలేదు. మూవీ చూస్తున్నంత సేపు అనిరుద్ ప్రత్యేకత ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పర్వాలేదనిపించాడు. ప్రొడ్యూసర్ సుభాష్కర ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా తీశాడని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. డైరెక్ట్ మాగిజ్ తిరుమెని డైరెక్టర్ గా ఓకే అనిపించుకున్నాడు. ఓవరాల్ గా ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అజిత్ అభిమానులకు నచ్చేలా ఉంది…


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?