పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan) రాజకీయాల్లో బిజీ అవ్వక ముందు చాలా సినిమాలకే కమిట్ అయ్యాడు. అందులో ఓజీ(OG), హరిహర వీరమల్లు(harihara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ (usthad Bhagat Singh)లాంటి సినిమాలకు సైన్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.
ఎలక్షన్ లో జనసేన తిరుగులేని విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దీంతో రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ సినిమాలను ఫినిష్ చేయలేకపోతున్నాడు. అయితే ఏమాత్రం కొంచెం ఖాళీ టైం దొరికిన ఈ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. హరిహర వీరమల్లు కొద్ది షూటింగ్ మినహా మిగతా మొత్తం కంప్లీట్ అయింది. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.
మొదట మార్చిలో వస్తుందనుకున్న ఈ మూవీ పవర్ స్టార్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయకపోవడంతో అది వాయిదా పడింది. సుజిత్ (sujeeth)డైరెక్షన్లో ఓజీ మూవీ కూడా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ మూడు సినిమాలు కాకుండా మరో సినిమాను కూడా పవర్ స్టార్ ఒప్పుకున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో… Pawan Kalyan
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూసర్ గా సురేందర్ రెడ్డి (surendar reddy) డైరెక్షన్లో మూవీ చేయాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి తో సైరా మూవీ తర్వాత దీనిపైనే వర్క్ చేశాడు.దాదాపు స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన మూవీస్ నే కంప్లీట్ చేయలేకపోతున్నా పవన్ కళ్యాణ్ ఈ మూవీ ని మొదలుపెట్టే ఛాన్స్ ఉండకపోవచ్చని ఫిలిం ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లును త్వరగా ముగించేయాల్సి ఉంది. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. కీరవాణి(keeravaani) మ్యూజిక్ ఇస్తున్న ఆ మూవీ నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓజీ మూవీ నుండి కూడా అప్పట్లో ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. దానిపై కూడా ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందన్న వార్తలపై ఎప్పటికప్పుడు ఈ మూవీ ఆగిపోలేదని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అందులో షూటింగ్ చేసిన ఒక సన్నివేశాన్ని కూడా ఇటీవల హరీష్ ఒక మూవీ మీటింగ్లో వివరించి ఆడియన్స్ లో మంచి జోష్ ని నింపారు.
ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాక..?
ప్రజెంట్ ఈ మూడు మూవీస్ లు రిలీజ్ అయ్యాకనే సురేందర్ రెడ్డి మూవీ ఫై పవన్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఎంత లేదన్న మరో మూడేళ్లకు పైగానే పట్టచ్చు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైతే ఈ మూవీ ఆగిపోయిందన్న ప్రచారం అయితే ఇండస్ట్రీలో వినబడుతుంది. ఆ మూవీ ఆగిపోయిందా, ఇంకా పవన్ లైనప్ లో ఉందా అనే విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..