Sarkar Live

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket

PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ ‘కోటి’ వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా “తాడు” వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం

PDS Rice Racket
  • ‘కోటి’ వ్యూహాలతో తాడాటకు టర్న్ తీసుకున్న పిడిఎస్ డాన్
  • తాడు మీద కోటి ఆశలు – డాన్ నడిపిస్తున్న కొత్త దందా!
  • గుట్టుగా సాగుతున్న తాడాట – పిడిఎస్ డాన్ కథ‌లో కొత్త మలుపు!

PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ ‘కోటి’ వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా “తాడు” వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పిడిఎస్ డాన్ పిడిఎస్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దాంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సదరు వ్యక్తి “కోటి” వ్యూహాలతో “తాడాట” మొదలుపెట్టినట్లు సమాచారం.

పిడీఎస్ బియ్యం దందా (PDS Rice Racket) లో ఆరితేరిన అతగాడు తాడాటను కూడా గుట్టుగా నడిపిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని జన సందోహం ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో గుట్టుగా తన మనుషుల ద్వారా “తాడాట” ఆడిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. పిడీఎస్ బియ్యం దందా చేసినప్పుడే ఎవ్వరూ తనను ఏమిచేయలేదని, తాడాట ఆడిస్తే ఏమవుతుందని తన సన్నిహితుల వద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడని తెలిసింది. పైగా తాను ఎక్కడ కూడా లైవ్ లో ఉండనని, తన మనుషులే ఈ దందా నిర్వహిస్తారని చెప్పుకోవడం గమనార్హం.జిల్లాలో పిడిఎస్ బియ్యం దందా జోరుగా కొనసాగించిన పిడిఎస్ డాన్ “తాడాట”ను కూడా జోరుగానే నిర్వహిస్తూ సంబంధిత పరిధిలోని అధికారులను సైతం మామూళ్లతో బాగానే మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం లేకపోలేదు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?