Sarkar Live

Privacy Policy

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు
State, warangal

ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Warangal Municipal Corporation) పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ఉపాధ్యక్షులు Kondeti Komura Reddy జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 15వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండేటి కొముర రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు....
Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి
Crime, warangal

Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి

వరంగల్ పోలీస్ కమిషనరేట్  (Warangal Police Commissionerate) పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత గంజాయి మత్తుకు బానిసలవకుండా, గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో( Kakatiya Medical College)లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ వారెంట్ల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రతి కేసులో వేగం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి గంజాయి వినియోగదారులను పట్టుకోవడం మాత్రమే కాకుండా, సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పా...
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!
Crime

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!

మ‌హిళా కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య వికారాబాద్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా కాలనీకి చెందిన బసవరాజ్ హోంగార్డుగా పనిచేసి ఆరేళ్ల క్రితం మరణించాడు. అతడి మూడో కుమార్తె బలిజ దివ్య 2020వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత ఐదేళ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప‌రిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బలిజ దివ్య మృతదేహం వద్ద ఒక సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం క...
రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”
Fatafat_with_pr

రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”

సీఐ విశ్వేశ్వ‌ర్‌తో ‘ఫటాఫట్’ ఇంటర్వ్యూ! రాజకీయ జోక్యాలు, పైస్థాయి ఒత్తిడులు.. ఇవేవీ ఆయన కర్తవ్య నిర్వహణ ముందు నిలవలేవు. "చట్టం ముందు అందరూ సమానమే" అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు సి.ఐ. డి. విశ్వేశ్వర్. అన్యాయాన్ని ఎదురిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్న ఆయన పనితీరుకు స్థానికులు 'గబ్బర్ సింగ్' అని పేరు పెట్టారు. విశ్వేశ్వర్ – ధైర్యం, నీతి నిజాయితీకి మారుపేరు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో చట్ట పరిపాలనకు కొత్త అర్థం తెచ్చారు. ఇటీవల తన కఠినమైన, నిష్పాక్షిక వైఖరితో ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ జోక్యాలు ఎన్ని వచ్చినా “చట్టం ముందు అందరూ సమానమే” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆయన పనితీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజకీయ ఒత్తిడులకు తలవంచని ఆయన ధైర్యసాహసం స్థానికుల్లో, పేద ప్రజలకు న్యాయం కోసం పో...
error: Content is protected !!