పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన – Ration Cards
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...




