పసుపుబోర్డు ప్రారంభం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్ షా Turmeric Board
National Turmeric Board Nizamabad | నిజామాబాద్ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నేటితో నెరవేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board ) జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. " జాతీయ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు పెద్ద బహుమతిని ప్రధాని మోదీ అందించారని తెలిపారు. టెర్మరిక్ బోర్డు ద్వారా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, నిజామాబాద్ పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.
పురాతన కాలం నుంచి భారత జీవనవిధానంలో పసుపు భాగమైందని, ఇది యాంటీ సెప్టిక్, యాంటీవైరల్ గుణాలు కలిగి ఉందని అమిత్ షా గుర్తుచ...




