Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి
Hyderabad News | ప్రముఖ తెలుగు టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్ హౌస్ లో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈమేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు.
గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎస్ఆర్ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు (14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొన...




