కాళోజీ వర్సిటీలో ‘మార్కుల’ మాయాజాలం : హరీష్‌రావు – Kaloji Narayana Rao University
Kaloji Narayana Rao University Scam | వరంగల్‌లోని ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చైర్మన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలు మసకబారుతున్నాయనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పీజీ వైద్య పరీక్షల్లో భారీ స్కామ్?
ఇటీవల జరిగిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాలపై హరీష్‌రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా 'రీ-వాల్యుయేషన్' (పునర్ మూల్యాంకనం ) చేసి వారిని ఉత్తీర్ణులను చేశారని ఆర...




