Sarkar Live

Privacy Policy

నిబంధనలు గాలికి.. ఫీజులే లక్ష్యం ‘నాగేశ్వరరావు ట్యూషన్స్’ ఆగడాలు – Fee Looting
Special Stories

నిబంధనలు గాలికి.. ఫీజులే లక్ష్యం ‘నాగేశ్వరరావు ట్యూషన్స్’ ఆగడాలు – Fee Looting

Fee Looting in Hanumakonda | విద్య ముసుగులో వ్యాపారం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 'నాగేశ్వరరావు ట్యూషన్స్' తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, భద్రతా ప్రమాణాలను విస్మరించి ఈ సంస్థ సాగిస్తున్న 'ఫీజుల దోపిడీ' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ​అనుమతులు లేవు.. అన్నీ అక్రమమే! ​ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ట్యూషన్ సెంటర్ నిర్వహించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. కానీ, నాగేశ్వరరావు ట్యూషన్స్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండానే హన్మకొండ, వరంగల్, నర్సంపేట వంటి ప్రధాన కేంద్రాల్లో యథేచ్ఛగా బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను నమ్మిస్తూ, భారీగా ఫీజులు వసూలు చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ​గొర్రెల మందల్లా విద్యార్థులు.. కనీస వసతులు శూన్యం ​ఈ ట్యూషన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సంస్...
​యుగపురుషుడు అంబేద్కర్ : నవభారత నిర్మాణానికి దిక్సూచి – Ambedkar Jayanti
Special Stories

​యుగపురుషుడు అంబేద్కర్ : నవభారత నిర్మాణానికి దిక్సూచి – Ambedkar Jayanti

Ambedkar Jayanti | ​అక్షరమే ఆయుధంగా.. ఆత్మగౌరవమే ఊపిరిగా.. అణగారిన వర్గాల విముక్తి కోసం పోరాడిన మహాజ్ఞాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది ఒక సామాజిక విప్లవం ఉదయించిన రోజు. ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాతగా, మేధో ప్రపంచపు ధ్రువతారగా వెలిగిన బాబాసాహెబ్ జయంతి నేడు. ఆయన ఏ ఒక్క వర్గానికో పరిమితమైన నేత కాదు; మానవతా విలువలను కాంక్షించే ప్రతి పౌరుడికీ ఆరాధ్యుడైన విశ్వమానవుడు. ​అవమానాల నుంచే అగ్రశిఖరాలకు.. ​ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన భీమ్‌రావ్, బాల్యంలో అంటరానితనం పేరిట అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నారు. కానీ, ఆ అవమానాలు ఆయనను బలహీనపరచలేదు.అవే ఆయనలో అకుంఠిత దీక్షను రగిల్చాయి. అసాధారణ ప్రతిభతో కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి పట్టాలు సాధించి, ఆ కాలంలోనే అత్యంత విద్యావంతుడైన భారతీయుడిగా చ...
సర్వే నెం 704లోని ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై కలెక్టర్ ఉక్కుపాదం – Road Encroachment
Special Stories

సర్వే నెం 704లోని ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై కలెక్టర్ ఉక్కుపాదం – Road Encroachment

క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సర్వే! సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ Paidipally Road Encroachment | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3 వ డివిజన్ పైడిపల్లి రెవెన్యూ శివారు లోని ప్రభుత్వ రోడ్డును తమ వెంచర్ లో కలుపుకున్న ప్రైవేట్ వెంచర్‌ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది. 'సర్కార్ లైవ్' వచ్చిన " 3 వ డివిజన్ లో భూ భాగోతం" ,"కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి", "కలెక్టర్ మేడం ప్రభుత్వ రోడ్డును రక్షించండి"అనే కథనాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్య శారద , ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం ​అసలేం జరిగింది? ​పైడిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 704లో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వ పానాదిని (రోడ్డు) కొంతమంది రియల్టర్ లు నిబంధనలకు విరుద్ధంగా తమ వెంచర్‌లో కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ...
తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన
State, Hyderabad

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన

తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం' నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​ప్రధాన డిమాండ్లు.. ​రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ​ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని కోరారు. ​సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర - మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి. ​కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో 'రా...
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. కీర్తినగర్ భూములపై ‘డిజిటల్’ సర్వే!
Special Stories

కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. కీర్తినగర్ భూములపై ‘డిజిటల్’ సర్వే!

Keerthinagar Land Digital Survey | ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములపై "సర్కార్ లైవ్" లో వెలువడిన కథనాలకు స్పందించిన కలెక్టర్, తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి (AD) ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం భూముల సర్వే నిర్వహించింది. ​సర్కార్ లైవ్ కథనానికి స్పందన ​మంగళవారం సర్కార్ లైవ్ లో "కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వ భూమి దక్కేది" అనే శీర్షికతో వెలువడిన వార్త జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. కీర్తినగర్ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదులను,వార్తా కథనాలను కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. సర్వే ద్వారా వాస్తవాలను వెలికితీయాలని ఆదేశించడంతో అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ...
error: Content is protected !!