Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
హనుమకొండ : క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు.
అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్ దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్ప్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...




