ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
ACB Raids | ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం డబ్బులు డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుదేరా జీపీలో గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమతి, కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పి.నాగలక్ష్మి రూ.8వేలు లంచం (Bribe) డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు.
దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు రంగంలోకి దిగారు. సోమవారం బుదేరాలోని జీపీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు జీపీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి...




