Sarkar Live

Privacy Policy

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
State, Hyderabad

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:

14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగడు' మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్...
Indiramma Indlu | పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి
State, Hyderabad

Indiramma Indlu | పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Indlu ) పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఎన్నికల హామీ కాదని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో, ప్రస్తుతం 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 52 వేల ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి - ఏప్రిల్ నెలల్లో కొత్త ఇండ్ల మంజూరు చేపడతామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలం నాటికి తొలి విడత ఇండ్లన్నీ పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మొదటి విడత తర్వాత మరో మూడు విడతలుగా ఇండ్ల మంజూరు ప్రక్రి...
Maoist Surrender : మావోయిస్టులకు భారీ షాక్..
Crime

Maoist Surrender : మావోయిస్టులకు భారీ షాక్..

పీఎల్జీఏ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు.. డీజీపీ ముందు సరెండర్! హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలక నేత, పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ) చీఫ్ బర్సే దేవా శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు (Maoist Surrender) . పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు మరియు ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఆయన జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఎవరీ బర్సే దేవా? బర్సే దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను దేవానే చూస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. పార్టీకి ఆయుధాల సరఫరా చేయడంలో మరియు దాడుల వ్యూహరచనలో దేవాది కీలక పాత్ర పోషించాడు. లొంగిపోయిన సమయంలో దేవా వద్ద ఉన్న అత్యాధునిక 'మౌంటెన...
Liquor Sales Record | తెలంగాణలో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు
Hyderabad

Liquor Sales Record | తెలంగాణలో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు

డిసెంబర్‌లో రూ. 5,102 కోట్ల విక్రయాలు.. న్యూ ఇయర్ కిక్కు మామూలుగా లేదు! హైదరాబాద్, జనవరి 1: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. 2025 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales Record) సరికొత్త రికార్డును సృష్టించాయి. కేవలం డిసెంబర్ నెలలోనే రూ. 5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఒకే నెలలో ఇంత భారీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల్లో రూ. 750 కోట్లు! న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిసెంబర్ 30: ఒక్కరోజే రూ. 375 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 సాయంత్రానికే అమ్మకాలు రూ. 350 కోట్లు దాటగా, అర్థరాత్రి వరకు జరిగిన అమ్మకాలతో కలిపి ఈ రెండు రోజుల్లోనే సుమారు రూ. 750 కోట్లకు పై...
భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!
National

భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!

Pralay Missile Success | భువనేశ్వర్/న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల బలం రోజురోజుకూ పెరుగుతోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం మరొక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ప్రలే' (Pralay) క్షిపణులను ఒకే లాంచర్ నుండి అతి తక్కువ వ్యవధిలో వరుసగా రెండుసార్లు (Salvo Launch) ప్రయోగించి తన సత్తాను చాటింది. ఏడాది చివరి రోజున అద్భుత ప్రయోగం డిసెంబర్ 31, 2025 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ఒడిశా తీరం నుండి ఈ క్షిపణులను ప్రయోగించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు క్షిపణులు తమ నిర్దేశిత మార్గాలను ఖచ్చితంగా అనుసరించి, శత్రు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఒకే లాంచర్ నుండి తక్కువ సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించడం (సాల్వో ప్రయోగం) ఈ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను నిరూపించింది. ప్రలే ఎందుకు ప్రత్యేకం? వేగం - ఖచ్చితత్వం: ఇది అత్యం...
error: Content is protected !!