కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే సర్కారు భూమి దక్కేది! – Land Encroachment
కనుమరుగవుతున్న హౌజింగ్ బోర్డు భూమి.. సర్వే నంబర్ 561లో అన్యాక్రాంతం
హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ కేంద్రంగా రాజకీయ నేతలు, రియల్ మాఫియా, అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు.
బుట్టదాఖలైన వరంగల్ ఆర్డీవో ఆదేశాలు
కలెక్టర్ జోక్యo చేసుకుని సర్వే చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
Gorrekunta Housing Board Land Encroachment | ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కరిగిపోతోంది.. రక్షణగా ఉండాల్సిన యంత్రాంగమే మౌనముద్ర దాల్చింది. గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 561 చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ చదరంగం నడుస్తోంది. అదృశ్య శక్తుల ఒత్తిడి, అధికారుల ఉదాసీనత వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు కీర్తినగర్ వాసుల్లో చర్చనీయాంశమైంది.
అశోక హోటల్ కేంద్రంగా 'చక్రం'!
హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ ఇప్పుడు అక్రమ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హౌజింగ్ బోర్డు భ...




