Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్
Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.శుక్రవారం, మే 16న ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు విద్యుత్ శాఖ ఈ విషయం గురించి వివరించింది. 2034 – 2035 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లు ఉండవచ్చని అంచనా వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రం (Data Centers )గా మారుతున్న దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మ...




