Sarkar Live

Privacy Policy

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires
Sports

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires

Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Virat Kohli టెస్ట్ కెరీర్.. Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో 40 గెలిపించాడు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కెప్పెన్ గా అతడు 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడ...
Superstar Rajinikanth జైలర్ -2లో బాలయ్య..?
Cinema

Superstar Rajinikanth జైలర్ -2లో బాలయ్య..?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth )హీరోగా తెరకెక్కుతున్న మూవీ జైలర్-2 (Jailar-2). నెల్సన్ దిలీప్ (Nelson Dileep kumar) కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో వరుస ప్లాఫ్ లు ఎదుర్కొంటున్న దశలో జైలర్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ సూపర్ స్టార్ బాక్సాఫీస్ కి తన స్టామినా రుచి చూపించాడు. అంతకుముందు తీసిన కొన్ని సినిమాలు ఒక రేంజ్ లోనే ఉన్నా కూడా సూపర్ స్టార్ రేంజ్ లో ఉండట్లేదనే నిరాశ ఫ్యాన్స్ లో ఉండేది. కానీ ఈ మూవీ అన్ని విమర్శలను తిప్పికొట్టింది. దిలీప్ నెల్సన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా కూడా ఇది నిలిచిపోయింది. ఇక తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తీసిన ఒక మూవీ డిజాస్టర్ లిస్టులో చేరిపోగా దిలీప్ నెల్సన్ జైలర్-2 స్క్రిప్ట్ పనులు ప్రారంభించాడు. సూపర్ స్టార్ ను కలిసిన సీక్వెల్ కి కూడ...
సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire
State

సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire

India-Pakistan ceasefire : మే 10న భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత, భారత సాయుధ దళాలు మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో పూర్తి వివరాలు వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సాయుధ దళాలు వివరాలను అందించాయి, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని పేర్కొంది. ఈ దాడుల్లో భారత దాడులు ముదస్సర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్, మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ అలియాస్ అబు ఆకాషా మరియు మొహమ్మద్ హసన్ ఖాన్ వంటి కొంతమంది 'మోస్ట్ వాంటెడ్' ఉగ్రవాదులను హతమార్చాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ దాడుల తరువాత, భారత్ పాకిస్తాన్ లోని మరిన్ని లక్ష్యాలను ఛేదించింది. నూర్ ఖాన...
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం వద్దు..
National

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం వద్దు..

Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ దుస్సాహసానికి తగిన విధంగా స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించారని తెలిపాయి. "ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మే 7న దాడుల తర్వాత భారత్ వైఖరి పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ బాంబులు వేస్తుంది. పాకిస్తాన్ ఆగిపోతే, భారత్ ఆగిపోతుంది అని కూడా ఆ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే మాట్లాడుతుంది, చర్చించడానికి వేరే అంశం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. "సింధూ జలాల ఒప్పందం సీమాంతర ఉగ్రవాదానికి సంబ...
Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం
State, Hyderabad

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ ...
error: Content is protected !!