Sarkar Live

Privacy Policy

మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025
State, warangal

మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025

Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం మెరుగైన సౌక‌ర్యాలు కల్పిస్తోంది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తుండ‌గా ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాతి కట్ట‌డాల‌తో దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ‌ మ‌రోవైపు మేడారం దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టింది. వంద‌లాది ఏళ్ల‌యినా చెక్కుచెద‌ర‌కుండా రాతి క‌ట్ట‌డాల‌తో నిర్మాణం చేప‌ట్టేందుకు మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొం...
HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం
State, Hyderabad

HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం

HILT Policy Leak : తెలంగాణ (Telangana)లో హిల్ట్ పాల‌సీ లీకేజ్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప‌రిపాల‌న ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ప్ర‌భుత్వానికి ఎంతో ప్రాముఖ్యం క‌లిగిన ఈ పాల‌సీ ప‌త్రాన్ని (Draft Document) లీక్ చేసిందెవ‌రు.. దీని వెనుక ఉన్న వారెవ‌వ‌రు? అనే విష‌యంపై విజిలెన్స్ విభాగం విచార‌ణ (Vigilance Investigation) చేప‌ట్టింది. ఈ లీకేజ్‌ వ్య‌వ‌హారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ని తెలుస్తోంది. హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే ఏమిటి? హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే హ‌య్య‌ర్ ఇంపాక్ట్ లాంగ్ ట‌ర్మ్ పాల‌సీ (Higher Impact Long-Term Policy) అని అర్థం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేప‌ట్టాల్సిన అభివృద్ధికి సంబంధించిన స‌మ‌గ్ర విధానం ఇది. 10–15 సంవత్సరాల దీర్ఘ‌కాలిక ప్రణాళికను ...
సినీ పరిశ్రమలో విషాదం: ఏవీయం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. -AVM Saravanan
Cinema

సినీ పరిశ్రమలో విషాదం: ఏవీయం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. -AVM Saravanan

AVM Saravanan | చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు ఏవీయం ప్రొడక్షన్స్ ప్రతిష్టను నిలబెట్టిన ప్రముఖ నిర్మాత, సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ కుమారుడు ఏవీఎం శరవణన్ (AVM Saravanan) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతోంది. అయితే, చికిత్స ఫలించక ఈ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పుట్టినరోజు మరుసటి రోజే.. ఏవీఎం శరవణన్ నిన్ననే (బుధవారం, డిసెంబర్ 3) తన 86వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం మృతి చెందడం సినీ ప్రముఖులను, అభిమానులను కలచివేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్ (AVM Productions), సౌత్ ఇండియన్ సినిమా నిర్మాణంలో అగ్రగామిగా నిలిచింది. మేయప్ప చెట్టియార్...
కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing
Crime

కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing

Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ త‌మ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న‌(Elder Brother)నే పొట్ట‌న పెట్టుకున్నాడు. మాన‌సిక వైక‌ల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే క‌న‌క‌రం కూడా లేకుండా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం (planned killing) మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హ‌త్య‌ చేశాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా (Karimnagar district) రామ‌డుగు మండ‌లంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారంలో వ‌రుస న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక‌వైపు వ్యాపారం స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డం, మ‌రోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయ‌డంతో న‌రేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్...
విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం
State, Hyderabad

విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం

Seasonal flu : తెలంగాణ‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్త‌రిస్తున్నాయి. వైర‌ల్ ఫీవ‌ర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైద‌రాబాద్ (Hyderabad)లో ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్ప‌త్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. Seasonal flu : ఆస్ప‌త్రుల్లో పెరిగిన‌ ర‌ద్దీ హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), న‌ల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ ఆస్ప‌త్రుల్లో వ‌చ్చేవారిలో తీవ్ర జ్వ‌రం, ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు ఉన్న వారే (patients) ఎక్కువ‌గా ఉంటున్నార‌ని వైద్యులు తెలి...
error: Content is protected !!