కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములకు ‘గ్రహణం’.. కలెక్టర్ ఆదేశించినా కదలని సర్వే! – Housing Board Lands
Keerthinagar Housing Board Lands | వరంగల్ నగరంలోని కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్య శారద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం "అడవిలో వెన్నెల" చందంగా మారింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం, హౌజింగ్ బోర్డు అధికారుల మధ్య సమన్వయ లోపం ఆక్రమణదారులకు వరంగా మారుతోంది.హౌజింగ్ బోర్డు భూముల అన్యాక్రాంతం పై "సర్కార్ లైవ్ "వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ తక్షణమే సర్వే పూర్తి చేసి హౌజింగ్ బోర్డు భూములకు హద్దులు నిర్ణయించాలని ఆదేశించగా సదరు భూములపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఈ నెల 13 వ తేదీన సర్వే పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారు
వివాదానికి ప్రధాన కారణాలు
రికార్డుల సాకు: భూ సేకరణకు సంబంధించిన పూర్తి రికార్డులు ఇస్తే...




