Sarkar Live

Privacy Policy

జబర్దస్త్  కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు యాక్సిడెంట్..!
Cinema

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు యాక్సిడెంట్..!

Jabardasth Comedian Ram Prasad : జబర్దస్త్‌ కమెడియన్‌ రాంప్రసాద్‌ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. గురువారం ఓ షూటింగ్‌కి వెళుతున్న రాంప్ర‌సాద్ కారు ప్రమాదానికి గురైనట్టు స‌మాచారం. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. రోజుమాదిరిగానే గురువారం రాంప్రసాద్‌ కారులో షూటింగ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌ తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్‌ కారు ముందుకు కారును ఢీకొట్టింది. కాగా రాంప్ర‌సాద్ ముందు వెళుతున్న కారు ఒక్క‌సారిగా సడెన్‌ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాంప్రసాద్‌ కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదం నుంచి త్రటిలో తప్పించుకున్న రాంప్రసాద్‌ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాంప్రసాద్‌కు ప్రమాదం జరిగినట్టు తెలిసి అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గ...
నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..
State

నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ మొబైల్ యాప్ ను స‌చివాల‌యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమ‌ని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి పేదలకు భూములను పంచార‌ని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ... ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుంద‌ని త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దీనిని 5లక్షల రూపాయ‌ల‌కు పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ల...
Pushpa 2 Movie Review | పుష్ప- ది రూల్ మూవీ రివ్యూ: అల్లు అర్జున్ మ‌రోసారి మాస్ యాక్ష‌న్‌..
Cinema

Pushpa 2 Movie Review | పుష్ప- ది రూల్ మూవీ రివ్యూ: అల్లు అర్జున్ మ‌రోసారి మాస్ యాక్ష‌న్‌..

Pushpa 2 Movie Review And Rating | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప - 2 ది రైజ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఎర్ర‌చంద్ర‌నం స్మగ్లర్ పుష్ప రాజ్ (Allu Arjun) త‌న వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శ‌క్తిగా ఎలా ఎదిగాడు.. అనే విషయాలను చూపుతుంది. అల్లు అర్జున్ మాస్ జాత‌ర పార్ట్‌లో మ‌రింత పీక్ చేరింది. సుకుమార్ తన రచనా నైపుణ్యంతో సినిమాకు ప్రాణం పోశాడు. అండర్ డాగ్ రెడ్ సాండర్స్ పుష్ప ఎలా అధికారంలోకి వచ్చాడనే దాని గురించి పుష్ప: ది రైజ్ లో చూడ‌గా, పార్ట్ 2 ది రూల్ అతను తన శక్తిని ప్రభావాన్ని ఉపయోగించి జీవితాన్ని ఎలా నావిగేట్ చేసాడో చూపిస్తుంది. ది రూల్‌లో అల్లు అర్జున్ న‌ట‌న‌, పుష్ప రాజ్‌గా తన యాటిట్యూడ్‌ని క్యారీ చేసే విధానం అద్భుతంగా ఉంది. ఈ చిత్రం కూడా త్వరగా ప్రధాన కథాంశంలోకి తీసుకెళ్తుంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ మధ్య ఆధిపత్యం కోసం య...
Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు
State

Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు

Ramagundam | పెద్దప‌ల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప్ర‌క‌టించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామ‌ని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామ‌ని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల‌కు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామ‌న్నారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార...
Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్
State

Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్

Google  | ప్ర‌ఖ్యాత టెక్ దిగ్గ‌జం గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)) ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయ‌బోయే గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐద‌వది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద‌ సెంటర్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒక‌ ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హబ్‌. ఇది హై సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయ‌నుంది. అత్యాధునిక పరిశోధన, ఏఐ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించే వేదికగా నిలవ‌నుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, యువ‌త‌కు ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ సెంట...
error: Content is protected !!