Meta to expand India | భారత్‌లో మెటా విస్తరణ.. సరికొత్త ప్రణాళిక
Meta to expand India : గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు భారతదేశం ఒక ప్రధాన గమ్యస్థానంగా మారింది. ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలతో అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్పడు మేటా (Meta) కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇండియాలో విస్తరించేందుకు ఆ కంపెనీ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిపుణులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
బెంగుళూరులో మెటా కొత్త కార్యాలయం
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా తాజాగా బెంగుళూరులో (Bengaluru) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), అమెజాన్ (Amazon) వంటి పెద్ద టెక్ కంపెనీల బాటలో నడిచేందుకు మెటా నిర్ణయించింది. ఇప్పటికే ఈ సంస్థలు బెంగుళూరు సహా భారత్‌లోని ఇతర నగరాల్లో తమ ఇంజనీరింగ్, ప్రొడెక్ట్ డెవలప్‌మెంట్ టీంలను విస్తరించుకోగా మెటా కూడ...




