Build Now | బిల్డ్ నౌ యాప్ తో భవనాలు, లేఔట్ల అనుమతులు ఈజీ..
Build Now | భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్ నౌ’ పేరుతో రూపొందించిన యాప్‌తో పాటు, ఆన్‌లైన్ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. సచివాలయంలో బిల్ట్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నారని అందుకే ఈ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకా...