Maharashtra | సర్పంచ్ హత్య..! రాష్ట్ర మంత్రి రాజీనామా
మహారాష్ట్ర (Maharashtra) ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే ( Dhananjay Munde) తన పదవికి రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసు (sarpanch murder case)లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముండే ఈ రోజు తన రాజీనామాను సమర్పించారు.
Maharashtra : సర్పంచ్ హత్య.. సిండికేట్ క్రైం
డిసెంబర్ 9న మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామంలో జరిగిన హత్య కలకలం రేపింది. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ కొందరు దుండగుల చేతిలో హతమయ్యారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో పోలీసులు వాల్మికీ కరద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఓ క్రైం సిండికేట్‌ను నడుపుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
మంత్రి ముండేకు సంబంధం ఏమిటి?
వాల్మికీ కరద్ అరెస్ట్ అయిన ...




