Devendra Fadnavis| మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్..?
Devendra Fadnavis | మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పుడు సీఎం ఎవరన్నది..? ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యమంత్రి పదవికోసం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis ), ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహా తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్ పవార్ (Ajit Pawar) మద్దతు తెలిపినట్లు సమాచారం.. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి ఏకంగా 235 సీట్లు గెలుచుకొని భారీ విజయం కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం ...