Sarkar Live

Privacy Policy

Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
State

Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

Indiramma Indlu Beneficiary Status : కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కోసం అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ల‌బ్ధిదారుల‌ జాబితా రూపొందించండంతోవారు నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే త‌మ‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరైందా లేదా అనే ఆందోళ‌న‌లో దర‌ఖాస్తుదారులు ఉన్నారు. వీరి ఆందోళ‌న‌కు చెక్ పెడుతూ ప్ర‌భుత్వం నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్‌ కూడా ప్రారంభించింది. నేరుగా ఇందులో ద‌ర‌ఖాస్తుదారుడు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికార వెబ్‌సైట్ Indirammaindlu.telangana.gov.in లో చాలా సుల‌భంగా మీ దర‌ఖాస్తు ( Indiramma Indlu Application ) వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ అందుబాటులో ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో ఖాళీ స్థ‌లం ఉన్నవారికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయడంత...
Winter Season : చలికాలం ఉదయాన్నే ఈ పానీయాలు తాగి ఈ సమస్యలకు చెక్ పెట్టండి..
LifeStyle

Winter Season : చలికాలం ఉదయాన్నే ఈ పానీయాలు తాగి ఈ సమస్యలకు చెక్ పెట్టండి..

Health Care Drinks for Winter Season : చలికాలంలో, శరీరంతో పాటు ఆరోగ్యంపై కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో మీరు ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో ప్రారంభించాలి. చ‌లికాలంలో శరీర జీవక్రియ మందగిస్తుంది, దీని కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే, మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని ర‌కాల‌ పానీయాలు తీసుకుంటే, అది మీ పెరుగుతున్న బరువును తగ్గించడమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి చలికాలంలో ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ప్రతిరోజూ ఏ పానీయాలు తీసుకోవాలో ఇక్క‌డ తెలుసుకోండి.. Drink these drinks in Winter Season : చలికాలంలో ఈ పానీయాలు బెస్ట్‌ నిమ్మరసం నిమ్మకాయలో జీవక్రియను పెంచే విటమిన్ సి ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ...
Ram Gopal Varma | వర్మను సత్య నిజంగా మార్చిందా..?
Cinema

Ram Gopal Varma | వర్మను సత్య నిజంగా మార్చిందా..?

Ram Gopal Varma | ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ వారిలో రాంగోపాల్ వర్మది మాత్రం డిఫరెంట్ స్టైల్. ఒక్కో డైరెక్టర్ కు వారి సినిమాలు నచ్చి కొంతమంది ఫ్యాన్స్ అయితారు. కానీ వర్మకు డైరెక్టర్లె ఫ్యాన్స్ గా ఉంటారు. డైరెక్టర్ల లో కెల్లా వర్మ వేరయా అంటుంటారు ఆడియన్స్. ఒకప్పుడు శివ(Shiva), క్షణక్షణం, రంగీలా, బూత్, సర్కార్ లాంటి ఎన్నో సినిమాల తో ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. కొన్ని సంవత్సరాలుగా తనకు నచ్చేట్టు మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇదేంటి మీరు ఇలాంటి మూవీస్ తీస్తున్నారు అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఒకటే సమాధానం నా ఇష్టం అనే సమాధానం మాత్రమే వస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తా నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని ముఖం మీదే చెప్తుంటారు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. తన మార్క్ సినిమాలను మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా బూతు సినిమాలనే...
Red alert | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద రెడ్‌ అల‌ర్ట్..
State

Red alert | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద రెడ్‌ అల‌ర్ట్..

Red alert | హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జ‌న‌వ‌రి 26న గణతంత్ర దినోత్సవం (Republic day 2025) ఉన్న నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎయిర్‌పోర్టు భద్రతను పటిష్టం చేయడంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Red alert : రెడ్ అలర్ట్ ప్రకటన జారీ జనవరి 30 వరకు ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్ (Red alert )ను అమల్లో ఉంచారు. అప్ప‌టి వ‌ర‌కు సందర్శకులు ఎయిర్‌పోర్టుకు రావద్దని సీఐఎస్ఎఫ్ అధికారులు ప్ర‌క‌ట‌న‌ జారీ చేశారు. గణతంత్ర వేడుకల కారణంగా ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా వ్యవస్థను కఠినతరం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టామని తెలిపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు ఎయిర్‌పోర్టులో ప్రధాన రహదారుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను నిర్వ‌హిస్తున్నారు. ఎయి...
Pre-term deliveries : అమెరికాలో భార‌తీయుల‌ ముంద‌స్తు కాన్పులు.. ఎందుకంటే..
World

Pre-term deliveries : అమెరికాలో భార‌తీయుల‌ ముంద‌స్తు కాన్పులు.. ఎందుకంటే..

US citizenship : అమెరికా (US)లో భార‌తీయ మ‌హిళ‌లు ముంద‌స్తు ప్ర‌స‌వాలు (Pre-term deliveries) చేయించుకుంటున్నారు. నెల‌లు పూర్తిగా నిండ‌క ముందే ఆప‌రేష‌న్ల ద్వారా పిల్ల‌ల‌ను క‌నేందుకు ఆస్ప‌త్రుల్లో బారులు తీరుతున్నారు. త‌ల్లీబిడ్డ‌ల‌కు ఇది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసినా ఈ రిస్కు తీసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. ముంద‌స్తు ప్ర‌స‌వాలు ఎందుకంటే.. అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజే డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థులు, టూరిస్టులు, తాత్కాలిక వర్క్ వీసాలు క‌లిగిన వారికి జన్మించే పిల్లలకు ఇక ఆ దేశ‌ పౌరసత్వం (Birthright US citizenship) లభించద‌ని ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిబంధ‌న 2025 ఫిబ్ర‌వ‌రి 20 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. చాలా కాలంగా అమ‌...
error: Content is protected !!