Amazon | తెలంగాణలో అమెజాన్ రూ. 60,000 కోట్ల పెట్టుబడులు
Amazon Web Services in Telangana : తెలంగాణలో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ ప్రణాళికలు రూపొందించింది. రూ.60,000 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
భారీ బడ్జెట్‌తో వస్తున్నాం: AWS వైస్ ప్రెసిడెంట్ మైఖేల్
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక దినోత్సవంలో ఏడబ్ల్యూఎస్ (Amazon Web Services) వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె (Michael Punke), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu)తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక రంగంలో అభివృద్ధికి ప్రణాళికలపై చర్చించి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం ప్రపంచ ఆర్థిక దినోత్సవం వేదికగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె కీ...




