Sarkar Live

Privacy Policy

Brahma anandam Review | బ్రహ్మ ఆనందం మూవీ ఎలా ఉందంటే.. !
Cinema

Brahma anandam Review | బ్రహ్మ ఆనందం మూవీ ఎలా ఉందంటే.. !

Brahma anandam Review | టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్రహ్మ ఆనందం (Brahma anandham). రాహుల్ యాదవ్ నిర్మాతగా నిఖిల్ (Nikhil) డైరెక్షన్లో మూవీ తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Brahma anandam Review కథ విషయానికి వస్తే.. బ్రహ్మానందం(రాజ గౌతమ్) జీవితంలో ఒక లక్ష్యం చేరుకోవాలనుకుంటాడు. తల్లి దండ్రులు లేని అతడు ఒంటరిగానే జీవిస్తాడు.తను రాసిన ఓ నాటిక ఒక షోలో ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. కానీ వారు చాలా డబ్బులు అడుగుతారు.దాని కోసం ఎదురుచూస్తున్న అతడికి మూర్తి (బ్రహ్మానందం) తనతో ఒక ఊరికి తీసికెళ్ళి తనతో ఉంటే 6 ఎకరాల పొలం రాసిస్తానంటాడు. ఆశపడి బ్రహ్మానందం అతడితో ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ అసలు ఏం జరిగింది. ఆఖరికి అనుకున్నది హీరో అనుకున్నది సాధించాడ లేదా అన్నదే కథ…. తెలుగులో తాతా మన...
Ganja | ఒడిశా టూ సూరత్..  గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు
Crime

Ganja | ఒడిశా టూ సూరత్.. గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు

నిందితుల ఆటకట్టించిన వరంగల్ పోలీసులు చూడటానికి ఉన్నత కుటుంబాలకు చెందినవారి కనిపిస్తూ గంజాయి (Ganja) రవాణాకు పాల్పడున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ ఘరానా దంపతుల నుంచి సుమారు 6 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరత్నం వివరాలను వెల్లడించారు. ఒడిశా (Odisha) రాష్ట్రానికి చెందిన గొగి శంకర్‌ దాస్‌ (39), పూర్ణిమ గొగిదాస్‌ (30) వీరూ ఇరువురు భార్యభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో నివాసం ఉంటున్నారు. కిలాడీ దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా నుంచి తీసుకవచ్చ...
Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక  క‌స‌రత్తు షురూ..
career

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు. Young India Residential Schools లో ఎలాంటి సౌక‌ర్యాలంటే.. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాస...
JioHotstar : విలీన‌మైన జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌.. కొత్త ఓటీటీలో ఉచితంగా కంటెంట్‌!
Technology, Cinema

JioHotstar : విలీన‌మైన జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌.. కొత్త ఓటీటీలో ఉచితంగా కంటెంట్‌!

JioHotstar : దేశంలోనే రెండు ప్రసిద్ధ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు విలీన‌మ‌య్యాయి. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ ఒక్క‌ట‌య్యాయి. ఈ రెండింటి విలీనంతో ఆన్‌లైన్ ప్రేక్ష‌కులు జియోహాట్‌స్టార్(JioHotstar) రూపంలో మ‌రింత ఎక్కువ‌ కంటెంట్ ను ఆస్వాదించ‌వ‌చ్చు. జియో, హాట్‌స్టార్ రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న కాంటెంట్‌ను ఒకే వేదిక‌పై వీక్షించ‌వ‌చ్చు. లేటెస్ట్‌ సినిమాలతోపాటు స్పెషల్ షోలు, సిరీస్‌లు చూడ‌వ‌చ్చు. ఇత‌ర అంత‌ర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు చెందిన కాంటెంట్‌ను కూడా జియో హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్ కానున్నాయి. జియోహాట్‌స్టార్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు జియోస్టార్ పేర్కొన్న‌ది. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివ‌రాల‌ను సైతం వెల్ల‌డించింది. కాగా రెండు ప్ర‌ముఖ‌ ఫ్లాట్‌ఫామ్‌లు క‌ల‌వ‌డంతో దాదాపు మూడు ల‌క్ష‌ల గంట‌ల కాంటెంట్ యూజ‌ర్స్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రోవ...
IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం
Business

IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం

IBS admissions : ఐసీఎఫ్ఏఐ (ICFAI) యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని బిజినెస్ స్కూల్ (IBS)లో అడ్మిష‌న్ల ప్రాసెస్ ప్రారంభ‌మైంది. ఎంబీఏ /పీజీపీఎం (MBA/PGPM) ప్రోగ్రామ్స్‌లో 2025 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల (IBS admissions ) కోసం ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 24 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని క్యాంప‌స్‌లో ఇది కొన‌సాగ‌నుంది. ఎంపిక విధానంలో మార్పులు ఏమింటే… దేశంలోని ఐదు ప్ర‌ముఖ బిజినెస్ స్కూల్స్‌లో IBS ఒక‌టి. ఇది వృత్తిపర, పరిశోధన ఆధారిత బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందించ‌డంలో పేరు గాంచింది. ఈ సంవత్సరం IBS తమ ఎంపిక విధానంలో ఒక కీలక మార్పు చేసింది. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహించే ఈ విద్యాసంస్థ కొత్త‌గా మైక్రో ప్ర‌జెంటేష‌న్ అనే ఎంపిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని వ‌ల్ల ప్ర‌తి విద్యార్ఙికీ వ్య‌క్త‌గ‌తంగా త‌మ ఆలోచ‌న‌లను చ‌క్క‌గా వ్య‌క్తీక‌రించే మంచి అవ‌కాశం ల‌భిస్తుంది....
error: Content is protected !!