Sankranthiki Vasthunnam : వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం
Sankranthiki Vasthunnam movie review : విక్టరీ వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటాయో మనకు తెలుసు. సంక్రాంతికి ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ లు అయినవి చాలానే ఉన్నాయి. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 మూవీస్ వచ్చాయి. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam ) టైటిల్ కు తగ్గట్టుగానే ఈ మూవీ సంక్రాంతి రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
విక్టరీ వెంకటేష్Victary Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్ 3 మూవీస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఎంత అలరించాయో ఈ మూవీ కూడా అంతకంటే ఎక్కువగా కామెడీతో అలరిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా తనదైన మార్క్ కామెడీ టేకింగ్ తో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి...




