Sarkar Live

Privacy Policy

Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత
Viral

Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత

Prakriti Malla World's Most Beautiful Handwriting : జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విద్య ఒక సాధనం. చేతిరాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉంది. విద్యలో చేతిరాత ఒక ముఖ్యమైన అంశమ‌నేంది కూడా నిజమే.. మంచి చేతిరాత గ‌ల‌ విద్యార్థులు తమ జీవితాల్లో పురోగతి సాధిస్తార‌ని చెబుతారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మంచి చేతిరాతను అభినందిస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రతిభ.. అంద‌రికీ అంద‌మైన హాండ్ రైటింగ్‌ రాదు.. మంచి చేతి రాత‌కోసం మీరు ప్రతిరోజూ సాధన చేయాలి. అందువల్ల, మీరు మీ పిల్ల‌ల‌ను ప్రతిరోజూ 15-20 నిమిషాలు చేతిరాతను సాధన చేయమని చెప్పాలి. ప్ర‌తీరోజు పిల్ల‌లు సాధన చేయడం వ‌ల్ల చేతిరాతలో క‌చ్చిత‌న‌మైన మార్పు వ‌స్తుంది. నేపాల్‌ (Nepal) కు చెందిన ప్రకృతి మల్లా (Prakriti Malla ) తన చేతిరాతతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అసాధారణ చేతిరాత ఆమెకు "ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాత" అనే బిరుదును సంపా...
Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన
State

Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

Tirupati flight cancelled : హైదరాబాద్‌ నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బుధవారం ఉదయం షంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి తిరుపతికి (Tirupati) బయల్దేరాల్సిన విమానం అనుకోని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యింది. దీంతో విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వొచ్చు క‌దా..! తిరుప‌తి విమానంలో ఏడుగురు (Passengers) ప్ర‌యాణించాల్సిన ఉండ‌గా వారు కొన్ని గంట‌ల‌పాటు ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వ‌చ్చింది. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం అందక‌పోవ‌డంతో ఏం జ‌రిగిందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌య్యారు. సాంకేతిక లోపాల కారణంగా విమానాన్ని రద్దు చేశామని సిబ్బంది చివ‌ర‌కు ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం వ్య‌క్తమైంది. విమానం రద్దయిన కారణంగా తమ దర్శన సమయాన్ని మిస్ అవుతా...
Pawan Kalyan | చెప్పిన టైమ్ కే.. హరిహర వీరమల్లు
Cinema

Pawan Kalyan | చెప్పిన టైమ్ కే.. హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుండి మూవీ వచ్చి చాలా సంవత్సరాలే అయింది.ఆఖరుగా సముద్రఖని డైరెక్షన్ లో బ్రో మూవీ వచ్చి అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. అంతకుముందే క్రిష్(krish) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు(Hari hara veeramallu),సుజీత్ డైరెక్షన్ లో ఓజీ(OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు సైన్ చేసిన పవన్ సెట్స్ మీదకు కూడా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. కూటమి అధికారంలోకి రావడంతో ఆ మూవీస్ ఆగిపోయాయి.దీంతో పవర్ స్టార్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ కు వెళ్లిన ఓజి ఓజి అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. దీంతో పవన్ ఒకసారి ఫ్యాన్స్ పై అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రెజెంట్ వారి ఆకలిని తీర్చేలా రెండు మూవీస్ ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు, రెండోది ఓజీ ఈ రెండు మూవీల షూటింగు దాదాపు అయిపో...
Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు..  భారతీయులకు షాకిస్తున్న యూఎస్
World

Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు.. భారతీయులకు షాకిస్తున్న యూఎస్

Illegal immigrants in US : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి పంపే ప్రక్రియను అక్క‌డి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే 205 మంది భారతీయులను సీ-17 సైనిక విమానం ద్వారా భారత్‌కు పంపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రవేశపెట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాల భాగంగా ఈ చ‌ర్యలు చేప‌డుతున్నారు. అమెరికాలో సుమారు 18 వేల మంది ఇండియ‌న్స్ అక్ర‌మంగా నివ‌సిస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం గుర్తించింది. తమ సైనిక విమానాల ద్వారా వలసదారులను వారి స్వదేశాలకు పంపే విధానాన్ని ప్రారంభించింది. ఇలా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను సైనిక విమానాల్లో సుర‌క్షితంగా పంప‌డం చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి అని ట్రంప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. స‌హ‌క‌రించాల‌ని మోదీని కోరిన ట్రంప్‌ ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ట్రంప్ ఇటీవ‌ల ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా నుంచి...
K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!
Cinema, Crime

K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!

Film Producer Suicide : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.పి. చౌదరి (Telugu film producer K P Choudhary) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గోవాలోని సియోలిమ్ గ్రామంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. త‌న ఆత్మ‌హ‌త్య (suicide)కు ఎవ‌రూ బాధ్యులు కార‌ని, కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెష‌న్ (depression) లో ఉన్నాన‌ని సూసైడ్‌నోట్‌లో చౌద‌రి పేర్కొన్నారు. త‌న మృత‌దేహాన్ని తమిళ‌నాడులో ఉంటున్న త‌న త‌ల్లికి అప్ప‌జెప్పాల‌ని కోరారు. కె.పి.చౌద‌రి ఆత్మ‌హత్య చేసుకున్నార‌నే వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్త‌మవుతోంది. సినీ పరిశ్రమలో ప్ర‌త్యేక గుర్తింపు కె.పి. చౌదరి (44) సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. రజనీకాంత్ (Rajinikanth) నటించిన "కబాలి" చిత్రాన్ని ఆయ‌న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన...
error: Content is protected !!