ITC : ఐటీసీ హోటల్స్ షేర్స్.. బిగ్ అప్డేట్స్
ITC Share Price : ఐటీసీ హోటల్స్ (ITC Hotels business ) షేర్స్ ఈ రోజు ఎక్స్-హోటల్స్‌గా ట్రేడవుతున్నాయి. ఐటీసీ హోటల్స్ షేర్ కోసం ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ NSE, BSE స్టాక్ ఎక్స్ఛేంజ్లలో జరిగింది. ఇందులో ఐటీసీ హోటల్స్ స్టాక్ ధర నిర్ణయించబడింది. సెషన్ ముగిసే నాటికి NSE వద్ద ఐటీసీ షేర్లు రూ. 455.60 వద్ద ట్రేడయ్యాయి. అంటే.. 5.4 శాతం (రూ. 26) తగ్గింపు అన్నమాట. అలాగే BSE వద్ద రూ. 455 వద్ద ముగిసాయి. అంటే 5.6% (రూ. 27) తగ్గింపు జరిగింది.
షేర్ల వివరాలు
ఐటీసీ హోటల్స్ షేర్స్ (Share ) రేషియో 1:10 గా ఉంది. అంటే. ఐటీసీ షేర్ల ప్రతి 10కు ఐటీసీ హోటల్స్‌లో ఒక షేర్ లభిస్తుంది. దీంతో ఐటీసీ హోటల్స్ మౌలికంగా ప్రత్యేక కంపెనీగా మారుతుంది. దీనికి సెపరేట్‌గా లిస్ట్ చేయబడుతుంది. అయితే, లిస్టింగ్ తేదీ ఇంకా తెలియజేయలేదు.
ITC హోటల్స్ వ్యాపారం
ఐటీసీ హోటల్స్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద హోటల్ కంపెనీలలో ఒకటిగ...




