Sarkar Live

Privacy Policy

Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర
State, Hyderabad

Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల చొప్పున భారీగా ధర పలికింది. ఈ రేటు, 2017లో నమోదైన మునుపటి రికార్డు ₹88,000 ను బద్దలు కొట్టి, నగరంలోని ప్రాపర్టీ విలువల్లో కొత్త దిశకు దూసుకుపోతోంది. ఈ వేలంలో సుమారు ఒక ఎకరం భూమి విజయవంతంగా అమ్ముడైంది. TSIIC వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ రికార్డు స్థాయి ధరలు హైదరాబాద్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. ‘బొటిక్ మల్టీ యూజ్’ ప్రాజెక్టులకు అనువైన ప్లాట్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ స‌మీపంలో ఉన్న రాయదుర్గ్‌ ప్రస్తుతం నగరంలోని...
Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?
Crime, National

Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?

Delhi Blast News updates : నిన్న రాత్రి దేశ రాజధానికి ఒక పీడకల. ఢిల్లీ న‌గ‌రానికి గుండెగా భావించే చాందినీ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్ వంటి ప్రాంతాలకు సమీపంలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఉపయోగించిన తెలుపు రంగు గ‌ల‌ హ్యుందాయ్ ఐ20 కారు పుల్వామాకు చెందిన వైద్యుడిదని దర్యాప్తు అధికారులు గుర్తించారు, దీనితో సెంట్రల్ ఢిల్లీలో జరిగిన దాడికి, అదే రోజు ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. కారులో ఉన్న‌ది ఎవ‌రు? కారు ప్రస్తుత యజమాని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. సోమవారం ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి ముందు అరెస్టు చేసిన ఇద్దరు వైద్యుల మాదిరిగానే ఆయనకు కూడా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. తాజా నివేదికల ప్రకారం, పుల్వామాలోని అతని కుటుంబ సభ్యులు, అతని తల్లి, సోదరుడిని...
Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు
Crime, Nalgonda

Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు

Bus Fire in Nalgonda | ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే క‌ర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్‌ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే న‌ల్ల‌గొండ‌లో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల‌ సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్...
ఎన్నిక‌ల‌ అధికారులపై బీఆర్ఎస్ ఆగ్రహం – హరీష్ రావు నేతృత్వంలో ఫిర్యాదు – Jubilee Hills Byelection
Hyderabad

ఎన్నిక‌ల‌ అధికారులపై బీఆర్ఎస్ ఆగ్రహం – హరీష్ రావు నేతృత్వంలో ఫిర్యాదు – Jubilee Hills Byelection

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి కొన‌సాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదులు అంద‌జేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం. కొంద‌రు పోలీసులు, ఇతర అధికారులు కాంగ్ర‌స్ పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఈ విష‌యాల‌పై సీ విజిల్ యాప్‌లో కూడా ఫిర్యాదులు చేస్తున్న...
Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి
Cultural, State

Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి

“జయ జయహే తెలంగాణ”తో చరిత్రలో చిరస్మరణీయం గొర్ల కాపరి నుంచి కవి వరకు… అనాథ నుంచి డాక్టరేట్ వరకు — అందెశ్రీ ప్రయాణం ఇదే! Andesri | తెలంగాణ ఆత్మకు కవిత్వం రాసిన గొప్ప కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్క‌డ‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టాలతో నిండిన బాల్యం సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందె ఎల్లయ్య, సాహిత్య ప్రపంచంలో “అందెశ్రీ”గా పేరు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో, అనాథగా పెరిగిన ఆయన కొన్నేళ్లు గొర్రెల కాపరిగా జీవించారు. అయితే అదే స‌మ‌యం ఆయనలో కవిత్వానికి అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని తరచుగా చెప్పేవారు. అందెశ్రీ (Andesri) పాఠ‌శాల‌కు వెళ్ల‌లేదు. ఎలాంటి చ‌దువు లేకపోయినా, తన కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై అసాధారణమైన‌ పట్టు సాధించారు. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం ...
error: Content is protected !!