ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల (KMC) ఆడిటోరియంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి మరియు వారెంట్ల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
అక్రమ దందాలపై ఉక్కుపాదం...
ఇసుక అక్రమ రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం దందాలు మరియు పేకాట స్థావరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
గంజాయి మూలాలపై నజర్..
గంజాయి వినియోగదారులను పట్టుకోవడమే కాకుండా, సరఫరా చేసే ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించాలని, ఇందుకో...




