Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బలిగొన్నాడు. ఆపై అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన యాదయ్య పెద్ద కూతురు అపర్ణ తరుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు కనిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విలవిలలాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ప...




