Sarkar Live

Privacy Policy

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌
State, Hyderabad

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం 'చలో బస్‌భవన్‌' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR ), మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao)ను పోలీసులు గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ...
Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం
Business

Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం

Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వ‌లా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్క‌యిన జ‌నం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్‌ ‌గవర్నమెంట్‌ ‌షట్‌డౌన్‌, ఆ ‌దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్‌ ‌పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గ‌రిష్ఠ‌ స్థాయికి చేరింది. హైద‌రాబాద్‌లో ధ‌ర‌లు ఇలా.. Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర...
Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?
State, Karimnagar

Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?

Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్ర‌మంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాట‌ల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ వేళ‌ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మ‌రోవైపు ఏఐసీసీ ఇంచార్...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌ను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించారు. కొత్త సంస్క‌ర‌ణ‌లు ఇవీ.. ఒక్కో...
బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌
Hyderabad, State

బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌

Hyderabad | RTC ఛార్జీల పెంపును నిరసిస్తూ, BRS ఎమ్మెల్యేలు వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీకి సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం మోపే ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని, వెంట‌నే బ‌స్సు చార్జీల‌ను త‌గ్గించాల‌ని వారు డిమాండ్ చేశారు. బ‌స్సులో ప్ర‌యాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా ప‌లువురు ప్ర‌యాణికులు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ పెంపుదల రోజువారీ ప్రయాణికులపై నెలకు రూ. 400-500 అదనపు భారం ప‌డుతోంద‌ని అన్నారు. ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, సేవలను మెరుగుపరచడంలో విఫలమైందని చాలా మంది ఆరోపించారు. అసెంబ్లీ సమీపంలో దిగిన తర్వాత, BRS శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్...
error: Content is protected !!